Cyclone Jawad: విజ‌య‌న‌గ‌రం జిల్లావైపు దూసుకొస్తోన్న జొవాద్.. ఈ కంట్రోల్ రూమ్ నంబర్స్ దగ్గర పెట్టుకోండి

జెట్‌ స్పీడ్‌తో జొవాద్ వచ్చేస్తోంది. సుడులు తిరుగుతూ తీరం వైపు దూసుకొస్తోంది. విశాఖ తీరానికి ఇంకా కేవలం 480 కిలోమీటర్ల దూరంలో కదులుతోంది.

Cyclone Jawad: విజ‌య‌న‌గ‌రం జిల్లావైపు దూసుకొస్తోన్న జొవాద్.. ఈ కంట్రోల్ రూమ్ నంబర్స్ దగ్గర పెట్టుకోండి
Cyclone Jawad

జెట్‌ స్పీడ్‌తో జొవాద్ వచ్చేస్తోంది. సుడులు తిరుగుతూ తీరం వైపు దూసుకొస్తోంది. విశాఖ తీరానికి ఇంకా కేవలం 480 కిలోమీటర్ల దూరంలో కదులుతోంది. ప్రస్తుతం గంటకు 30 కిలోమీటర్ల వేగంతో జొవాద్‌ దూసుకువస్తోంది. మరో ఆరు గంటల్లో మరింత వేగం పుంజుకుని ఉత్తరాంధ్రతోపాటు ఒడిషాపై దాడి చేయనుంది. జొవాద్‌ ఎఫెక్ట్‌తో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలతో సముద్రం భీతిగొలుపుతోంది. తీరం వెంబడి గంటకు వంద కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తున్నాయ్. జొవాద్‌ విధ్వంసం ఏ స్థాయిలో ఉండనుందో ఊహించడం కూడా కష్టమే. ఊహకందని విధంగా విధ్వంసం ఉండొచ్చని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఉత్తరాంధ్రలో మినిమం 7 సెంటీమీటర్ల నుంచి మాగ్జిమమ్‌ 20 సెంటీమీటర్ల మేర వర్షం కురిసే అవకాశముందని ఐఎండీ చెబుతోంది. ఐఎండీ వార్నింగ్‌ను చూస్తుంటే ఎవరూ ఊహించని స్థాయిలో ప్రమాదం జరిగేలా కనిపిస్తోంది.

జొవాద్ ఎఫెక్ట్‌తో స్టేట్‌వైడ్‌గా ఏపీ హైఅలర్ట్ ప్రకటించింది. రాష్ట్రమంతటా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. జొవాద్ ఎఫెక్ట్ అధికంగా ఉండే ఉత్తరాంధ్రలో పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఈరోజు, రేపు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. విశాఖలో అన్ని పర్యాటక ప్రాంతాలు మూసివేశారు. జొవాద్‌ తుఫాన్‌పై ప్రధాని మోదీ సమీక్ష జరిపారు. ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్స్‌తోపాటు నేవీ హెలికాప్టర్లు, కోస్ట్‌గార్డ్‌, ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ టీమ్స్‌ రెడీగా ఉండాలని సూచించారు. జొవాద్ ఎఫెక్ట్‌తో దక్షిణమధ్యరైల్వే పలు రైళ్లను రద్దుచేసింది. సుమారు 40 రైళ్లను ఈరోజు, రేపు క్యాన్సిల్ చేసింది.

ఉత్తరాంధ్రపై విరుచుకుపడేందుకు దూసుకొస్తున్న జొవాద్ మామూలు తుఫాన్ కాదు. పెను తుఫాను. జాగ్రత్తగా లేకపోతే అంతే సంగతులు. మన ఊహకందని విధంగా విధ్వంసం సృష్టించే అవకాశముంది.

కాగా విజ‌య‌న‌గ‌రం జిల్లాపై తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు.  అన్ని మండ‌లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. ఈ నంబర్లను జాగ్రత్తగా దగ్గర పెట్టుకోండి.

మండ‌లాల వారీగా కంట్రోల్ రూముల నెంబ‌ర్లు –

1. విజ‌య‌న‌గ‌రం డివిజన్ ఆర్‌డిఓ ఆఫీస్  8922276888 2.పార్వ‌తీపురం డివిజ‌న్ స‌బ్ క‌లెక్ట‌ర్ ఆఫీస్ 7286881293

…………………………………………..

1.భోగాపురం : 8074400947 2.బొండ‌ప‌ల్లి : 9494340170 3.చీపురుప‌ల్లి : 9951520101 4.ద‌త్తిరాజేరు : 6303131206 5.డెంకాడ : 9490036688 6.గ‌జ‌ప‌తిన‌గ‌రం : 9963456373 7.గంట్యాడ : 9440178300 8.గ‌రివిడి : 9391626256 9.గుర్ల : 8639657970 10.జామి : 9493072795 11.కొత్త‌వ‌ల‌స : 9063452990 12.ఎల్.కోట : 6302060131 13.మెంటాడ : 6301377418 14.మెర‌క‌ముడిదాం : 6301740792 15.నెల్లిమ‌ర్ల : 9381494140 16.పూస‌పాటిరేగ : 9948748334 17.శృంగ‌వ‌ర‌పుకోట : 8500045143 18.వేపాడ : 9440712421 19.విజ‌య‌న‌గ‌రం : 9100497329 20.పార్వ‌తీపురం : 9492895364 21.బ‌లిజిపేట : 9110535874 22.సీతాన‌గ‌రం : 9912390971 23.కురుపాం : 9492995878 24.కొమ‌రాడ : 9492506558, 8247008956 25.జిఎల్ పురం : 8309085355 26.జియ్య‌మ్మ‌వ‌ల‌స : 9346556187, 9948614865 27.గ‌రుగుబిల్లి : 8142995131 28.బొబ్బిలి : 8919598043 29.బాడంగి : 8106877661, 8309239166 30.తెర్లాం : 9182881540 31.రామ‌భ‌ద్రాపురం : 9989369511 32.సాలూరు : 9392687005 33.పాచిపెంట : 9494972582 34.మ‌క్కువ : 8374752591

త్రాగునీరు, శానిటేష‌న్‌కు సంబంధించి పంచాయితీశాఖ కంట్రోల్‌రూము నెంబ‌ర్లు : – విజ‌య‌న‌గ‌రం డివిజ‌న్ : 8639313400 పార్వ‌తీపురం డివిజ‌న్ : 9618967524

Also Read: ఈ ఫోటోలో ఓ పాము దాగుంది.. కనిపెట్టండి చూద్దాం.. అంత ఈజీ కాదండోయ్

మా సౌండ్ బాక్సులు డ్యామేజ్ అవుతాయ్.. యూఎస్‌లో నోటీసు బోర్డ్స్.. అల్లాడిచ్చిన తమన్

Click on your DTH Provider to Add TV9 Telugu