AP Weather Alert: ఏపీలో నైరుతి గాలుల ఎఫెక్ట్.. రాగల మూడు రోజులు వాతావరణం ఎలా ఉండనుందంటే..

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా నైరుతి దిశ నుండి గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయని, దీని ఫలితంగా

AP Weather Alert: ఏపీలో నైరుతి గాలుల ఎఫెక్ట్.. రాగల మూడు రోజులు వాతావరణం ఎలా ఉండనుందంటే..
Weather Report
Follow us

|

Updated on: Jan 23, 2022 | 12:42 PM

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా నైరుతి దిశ నుండి గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయని, దీని ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణంలో వివిధ మార్పులు చోటు చేసుకుంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు అధికారులు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి రాగల మూడు రోజుల వాతావరణ వివరాలు ఇలా ఉన్నాయి..

ఉత్తర కోస్తాంధ్ర.. ఉత్తరకోస్తాంధ్ర ప్రాంతంలో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తాంధ్ర.. ఇవాళ, రేపు దక్షిణకోస్తాంధ్రలో ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ.. ఈరోజు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

Also read:

Telangana: : పైనుంచి చూస్తే అల్లం లోడే… లోపల చెక్ చేసిన పోలీసులు మైండ్ బ్లాంక్ అయ్యింది

Pan Card: పాన్ కార్డును అప్​డేట్ చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..

Netaji Jayanti: ఘనంగా నేతాజీ వేడుకలు.. ప్రముఖులకు అవార్డులను ప్రధానం చేసిన జన్ ఉర్జా మంచ్..