Divyavani on Kodali Nani : కర్నూలులో నిన్న నారా లోకేష్ మాట తీరు, శరీర తీరు, చూశాక కొడాలి నానీకి మతిపోయినట్టుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దివ్యవాణి అన్నారు. ఇవాళ మంత్రి కొడాలి నానీ మాటలు, ప్రవర్తన, నడవడిక చూసిన వారంతా ఆయనకు పిచ్చిపట్టిందేమోనని అనుకుంటున్నారని దివ్యవాణి అన్నారు. ‘హూ కిల్డ్ బాబాయి’ అనే ప్రశ్నకు, కోడికత్తి ఘటనకు సమాధానం చెప్పగల ధైర్యం కొడాలికి ఉందా..? అని ఆమె ప్రశ్నించారు. వివేకా హత్యకేసు విచారణ వేగవంతమైన తరుణంలోనే, కేసుతో సంబంధమున్నవారంతా ఆసుపత్రుల్లో ఎందుకు చేరుతున్నారో నాని చెప్పాలని దివ్యవాణి డిమాండ్ చేశారు.
సాక్షాత్తూ సీఎం జగన్ బాబాయి దివంగత వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఈ రాష్ట్రంలో తనకు రక్షణ లేదన్న వ్యాఖ్యలపై నానీ ఏం చెబుతాడని ఆమె నిలదీశారు. గతంలో చంద్రబాబునాయుడు రూ.6 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని మొరిగిన వారంతా ఇప్పుడెందుకు నోరెత్తడం లేదో నానీకి తెలుసా అని ఆమె సూటిగా ప్రశ్నించారు.
లోకేష్ ను విమర్శించే స్థాయి కొడాలి నానికి ఉందా అని దివ్యవాణి ప్రశ్నించారు. ఏపీ ప్రజలైతే సరికొత్త లోకేష్ ను చూసి, స్వర్గీయ ఎన్టీఆర్‌లా ఉన్నాడంటున్నారని ఆమె పేర్కొన్నారు. తండ్రి వయసున్న చంద్రబాబుని, లోకేష్ ని విమర్శిస్తూ బూతులు తిడుతున్న నానీ, ముందు తానేం తింటున్నాడో తెలుసుకోవాలని దివ్యవాణి సూచించారు.
Smt. @DivyaVaniTDP addressing the media about the recent comments made by the YSRCP Leaders – LIVE https://t.co/Wx5K5MODro
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) June 19, 2021