APSSDC Jobs: ఏపీలో నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. 300 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. 6న ఇంటర్వ్యూలు

APSSDC Jobs: ఏపీలోని నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) మరో సారి గుడ్‌న్యూస్‌ వినిపించింది. Deccan Fine Chemicals (India) Pvt Ltdలో ..

  • Subhash Goud
  • Publish Date - 3:03 am, Fri, 5 March 21
APSSDC Jobs: ఏపీలో నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. 300 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. 6న ఇంటర్వ్యూలు

APSSDC Jobs: ఏపీలోని నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) మరో సారి గుడ్‌న్యూస్‌ వినిపించింది. Deccan Fine Chemicals (India) Pvt Ltdలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ప్రొడక్షన్ విభాగంలో 300 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఆసక్తి ఉంఇడ అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 6న నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

విద్యార్హతలు:

ప్రొడక్షన్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ(B.Sc Chemistry) చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అర్హులు. అలాగే 2016 – 2020 ఏళ్ల మధ్య పాసైన వారు దరఖాస్తుకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 18,660 వరకు వేతనం చెల్లించనున్నట్లు ప్రకటనలో తెలిపింది. కేవలం పురుషులు మాత్రమే దరఖాస్తు చేయాలని ప్రకటించింది.

ఇంటర్వ్యూలు..

కాగా, అర్హత కలిగిన అభ్యర్థులు ‘రాజీవ్ గాంధీ ఇనిస్ట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ సైన్స్, రమణయ్యపేట, నియర్ సర్పవరం జంక్షన్, ఎస్ఆర్ఎంటీ బ్యాక్ సైడ్, కాకినాడ – 533005’ చిరునామాలో ఈ నెల 6న నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరవ్వాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు అభ్యర్థులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇతర ఏమైనా సందేహాలుంటే 9010737998 నంబర్ ను సంప్రదించాలని సూచించారు. ఇలా ఏపీ రాష్ట్రంలో చాలా రంగాల్లో ఖాళీలు ఏర్పడ్డ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేస్తోంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆయా కంపెనీలలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తున్నాయి.

ఇవీ చదవండి :

PF Account Balance: ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్) బ్యాలెన్స్ చెక్ చేసుకోవ‌డం ఎలా..? నాలుగు సులభమైన మార్గాలు

SBI Mega E-Auction: అతి తక్కువ ధరకే ఇళ్లు, స్థలాలు, వాహనాలు, యంత్రాలు.. నేడు ఎస్‌బీఐ మెగా ఈ-వేలం