టీడీపీ నేతలపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన స్పీకర్

ప్రతిపక్ష టీడీపీ నాయకులపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలను కౌన్‌ కిస్కాగాళ్లు అంటూ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన.. కొత్తగా ఎంపికైన గ్రామ వాలంటీర్లతో ముచ్చటించారు. సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టిన సమయంలో వచ్చిన ఆలోచనే ఈ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అన్నారు.అయితే వాలంటీర్ల ఎంపికపై టీడీపీ పిటిషన్ వేస్తే భయపడొద్దు.. మీ పని మీరు చేసుకోండంటూ.. పై వ్యాఖ్యలు చేశారు. గ్రామ వాలంటీర్లకు […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:14 am, Tue, 13 August 19
టీడీపీ నేతలపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన స్పీకర్

ప్రతిపక్ష టీడీపీ నాయకులపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలను కౌన్‌ కిస్కాగాళ్లు అంటూ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన.. కొత్తగా ఎంపికైన గ్రామ వాలంటీర్లతో ముచ్చటించారు. సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టిన సమయంలో వచ్చిన ఆలోచనే ఈ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అన్నారు.అయితే వాలంటీర్ల ఎంపికపై టీడీపీ పిటిషన్ వేస్తే భయపడొద్దు.. మీ పని మీరు చేసుకోండంటూ.. పై వ్యాఖ్యలు చేశారు.

గ్రామ వాలంటీర్లకు ఆముదాలవలస ఎమ్మెల్యేగా అండగా ఉంటానన్నారు. స్పీకర్ రివ్యూలు ఎలా చేస్తారంటూ కొంతమంది అవివేకులు విమర్శిస్తున్నారని.. తాను మొదట ఆముదాలవలస ఎమ్మెల్యేను.. ఆ తర్వాతే స్పీకర్‌నని సీతారాం స్పష్టం చేశారు. తనను గెలిపించిన ప్రజలకు ఏమైనా సమస్యలు వస్తే ఎవరు పరిష్కరిస్తారని ప్రశ్నించారు.
స్పీకర్‌గా తనకు విశేష అధికారాలు ఉన్నాయని, తనపై కారుకూతలు కూసే వాళ్లు ఈ విషయాన్ని తెలుసుకోవాలన్నారు. కాగా, స్పీకర్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగబద్దమైన స్పీకర్ పదవిలో ఉండి విపక్ష నేతలపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ మండిపడుతున్నారు.