సంక్రాంతి పండ‌గ‌కు 1500 ప్ర‌త్యేక బ‌స్సులు.. ప్ర‌యాణికుల‌కు ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఏర్పాట్లు.!

అమ‌రావ‌తి: సంక్రాంతి పండ‌గ వ‌చ్చిందంటే చాలు.. ఆర్టీసీ బ‌స్టాండ్లు ర‌ద్దీతో నిండిపోతుంది. పండ‌గ‌కు సొంతూళ్ల‌కు వెళ్లేందుకు ప్ర‌జ‌లు సిద్ధ‌మ‌వుతుంటారు. ప్ర‌యాణికుల ర‌ద్దీని దృష్టిలో...

సంక్రాంతి పండ‌గ‌కు 1500 ప్ర‌త్యేక బ‌స్సులు.. ప్ర‌యాణికుల‌కు ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఏర్పాట్లు.!
Follow us

|

Updated on: Dec 17, 2020 | 8:19 AM

అమ‌రావ‌తి: సంక్రాంతి పండ‌గ వ‌చ్చిందంటే చాలు.. ఆర్టీసీ బ‌స్టాండ్లు ర‌ద్దీతో నిండిపోతుంది. పండ‌గ‌కు సొంతూళ్ల‌కు వెళ్లేందుకు ప్ర‌జ‌లు సిద్ధ‌మ‌వుతుంటారు. ప్ర‌యాణికుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని ప్ర‌తి ఏడాది ఏపీ స‌ర్కార్ ఆయా రూట్ల‌లో ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డుపుతోంది. ఈ సంక్రాంతి పండ‌గ‌కు ఆర్టీసీ 1500 ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డిపేందుకు సిద్ధ‌మ‌వుతోంది. గ‌త రెండేళ్ల నుంచి 2,200 స‌ర్వీసుల వ‌ర‌కు తిప్పిన ఆర్టీసీ.. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో బ‌స్సుల సంఖ్య‌ను త‌గ్గించ‌నుంది. ప్ర‌యాణికుల డిమండ్‌ను బ‌ట్టి స‌ర్వీసుల‌ను న‌డ‌పాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. బుధ‌వారం అన్ని జిల్లాల ఆర్టీసీ అధికారుల‌తో స‌మావేశ‌మైన ఎండీ కృష్ణ‌బాబు స‌ర్వీసుల‌పై చ‌ర్చించారు.

ప్ర‌ధానంగా సంక్రాంతి పండ‌గ‌కు ఎన్ని స‌ర్వీసులు న‌డ‌పాల‌నే అంశంపై చ‌ర్చించారు. క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌త్యేక బస్సుల‌పై ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకోనున్నారు. అత్య‌ధికంగా స‌ర్వీసులు హైదరాబాద్‌కు తిప్పేందుకు ప్ర‌ణాళిక రూపొందించారు. ఇప్ప‌టికే తూర్పు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల‌కు రిజ‌ర్వేష‌న్‌లు ఫుల్ అయ్యాయి. ఈ జిల్లాల‌కు ప్ర‌తి ఏటా డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల‌కు ప్ర‌త్యేక బ‌స్సుల‌ను అధిక సంఖ్య‌లో న‌డిపేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నారు అధికారులు.

అలాగే హైద‌రాబాద్‌లోని మ‌హాత్మ‌గాంధీ బ‌స్ స్టేష‌న్ ర‌ద్దీ త‌గ్గించేందుకు, బ‌స్సుల పార్కింగ్ ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఏపీఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బీహెచ్ ఈఎల్‌లో బ‌స్సుల పార్కింగ్‌కు గ‌తంలో ఆర్టీసీ స్థ‌లం కొనుగోలు చేయ‌డంతో ఇబ్బందులు లేవ‌ని అధికారులు చెబుతున్నారు. అనంత‌పురం, క‌ర్నూలు, కడ‌ప‌, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, మాచ‌ర్ల వైపు వెళ్లే రెగ్యూల‌ర్‌, పండ‌గ ప్ర‌త్యేక బ‌స్సుల‌న్నీ ఎంజీబీఎస్ వెలుప‌ల ఉన్న గౌలిగూడ సీబీఎస్ హంగ‌ర్ నుంచి బ‌య‌లుదేరేలా చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.

గ‌త ఏడాది పండ‌గ‌కు ఆర్టీసీకి రూ.67 కోట్ల మేర ఆదాయం రాగా, ప్ర‌యాణికుల‌పై భారం మోప‌కుండా 40 శాతం రాయితీతో ప్ర‌త్య‌క స‌ర్వీసుల‌ను ఆర్టీసీ న‌డిపింది. ఈ పండ‌గ‌కు సొంతూళ్ల‌కు వెళ్లేవారికి ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఏర్పాట్లు చేస్తున్నారు. చెన్నై, బెంగ‌ళూరుల‌కు ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డ‌ప‌నున్నారు.

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు