Rain Alert: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఏపీలో మరో మూడు రోజులపాటు వర్షాలు

Rain Alert in Andhra Pradesh: దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. నిత్యం రికార్డు స్థాయిలో ఎండల తీవ్రత నమోదవుతోంది. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో వింత పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు ఎండలు భారీగా పెరుగుతుంటే.. మరోవైపు

Rain Alert: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఏపీలో మరో మూడు రోజులపాటు వర్షాలు
Rain Alert
Follow us

|

Updated on: May 12, 2021 | 3:01 PM

Rain Alert in Andhra Pradesh: దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. నిత్యం రికార్డు స్థాయిలో ఎండల తీవ్రత నమోదవుతోంది. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో వింత పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు ఎండలు భారీగా పెరుగుతుంటే.. మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి. దీంతో ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు కొంతమేర ఉపశమనం కలుగుతోంది. కాగా.. కొన్ని రోజులుగా ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. అయితే.. ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం బుధవారం ప్రకటనను విడుదల చేసింది. ఈ సందర్భంగా మూడు రోజులకు సంబంధించిన వాతవరణ రిపోర్టును వెల్లడించింది. రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ సందర్భంగా గంటకు 30-40 కి. మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది.

ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం : బుధవారం, గురువారం, శుక్రవారం ఉరుములు , మెరుపులతో పాటు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈ రోజు, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ: ఈ రోజు, రేపు , ఎల్లుండి ఉరుములు, మెరుపులతో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Also Read:

Coconut Milk: కొబ్బరి పాలు తాగితే.. వైరల్ ఇన్ఫెక్షన్లన్నీ మటుమాయం.. అవేంటంటే..?

Unauthorised vaccination: అస్సాంలో కోవిడ్ టీకా రెండు వేలు.. సమాంతర వ్యాక్సినేషన్ కేంద్రం నడుపుతున్న ఆరోగ్యకార్యకర్తలు!