AP MLC Election: ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీ ఫోకస్‌.. క్లీన్‌స్విప్ దిశగా అధినేత కసరత్తు.. ఒకట్రెండు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన!

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార పార్టీ YCP ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం కసరత్తు ముమ్మరం చేసింది.

AP MLC Election: ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీ ఫోకస్‌.. క్లీన్‌స్విప్ దిశగా అధినేత కసరత్తు.. ఒకట్రెండు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన!
Ys Jagan
Follow us

|

Updated on: Nov 10, 2021 | 5:22 PM

AP MLC Elections 2021: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార పార్టీ YCP ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం కసరత్తు ముమ్మరం చేసింది. మొత్తం 14 స్థానాలు ఖాళీలు ఉండగా, పదుల సంఖ్యలో ఆశావహలు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ అధిష్టానం.. జిల్లాల వారీగా నేతల వడబోతను చేపట్టింది. ఇందుకోసం అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు కొందరి పేర్లు ఖరారు అయ్యినట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

MLC కోటాలో 3 ఖాళీలు..! స్థానిక సంస్థల కోటాలో 11 ఖాళీలు..! అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది వైసీపీ. అసెంబ్లీ, స్థానిక సంస్థల్లో YCPదే పూర్తి మెజార్టీ ఉండటంతో ఈ 14 స్థానాల్లోనూ విజయం నల్లేరుపై నడకే అని పార్టీవర్గాలు భావిస్తున్నాయి. దాదాపు అన్ని కూడా ఏక‌గ్రీవం అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. అందుకే క్యాండిడేట్ల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది హైకమాండ్. అన్ని ఈక్వేషన్స్‌ను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురి పేర్లు ఖరారైనట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

అభ్యర్థుల ఎంపిక విషయంలోరాజ‌కీయ, సామాజిక సమీకరణాలు, జిల్లాల్లో ఉన్న ప్రాధాన్యతతో పాటు.. పార్టీ విధేయుత‌కు పెద్దపీట వేస్తున్నారు.ఎమ్మెల్యే కోటాలో క‌డ‌ప జిల్లాకు చెందిన తాజా మాజీ ఎమ్మెల్సీ గోవింద‌రెడ్డి, శ్రీ‌కాకుళం జిల్లా నుండి పాల‌వ‌ల‌స‌ విక్రాంత్, క‌ర్నూలు జిల్లా నుంచి ఇసాక్ పేర్లు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక, స్థానిక సంస్థల విషయానికి వస్తే.. గుంటూరు జిల్లా నుంచి ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వర్లు, మ‌ర్రి రాజశేఖ‌ర్, కృష్ణా జిల్లాలో త‌ల‌శిల ర‌ఘురాం, ప్రకాశం జిల్లా నుంచి రంగ‌నాథబాబు, వైజాగ్ నుంచి వంశీ కృష్ణ యాద‌వ్, విజ‌య‌న‌గరం జిల్లా నుంచి ఇందుకూరి ర‌ఘురాజు, తూర్పుగోదావ‌రి నుంచి అనంత‌బాబు, చిత్తూరు జిల్లా భ‌ర‌త్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

అయితే, 14 స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల‌కు 50 శాతం వ‌ర‌కు కేటాయించే అవకాశం ఉంది. ఒక‌టి రెండు రోజుల్లో ఎంపిక ప్రక్రియ పూర్తికానుందని తెలుస్తోంది. ఆ వెంటనే అధికారికంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశముందని పార్టీవర్గాలు చెబుతున్నాయి.

Read Also…  Padma Awards: నచ్చినవారికే బహుమానాలు.. వివాదాస్పదమవుతున్న పద్మ అవార్డుల ప్రదానోత్సవం!