స్థానిక ఎన్నికలకు కరోనా లింక్.. కోవిడ్ తీవ్రత తగ్గలేదంటున్న ఏపీ సర్కార్.. తగ్గాయంటున్న ఎస్ఈసీ.. అసలు లెక్కలు ఏంటీ..!

స్థానిక ఎన్నికలకు కరోనా లింక్.. కోవిడ్ తీవ్రత తగ్గలేదంటున్న ఏపీ సర్కార్.. తగ్గాయంటున్న ఎస్ఈసీ..  అసలు లెక్కలు ఏంటీ..!

ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి కట్టడి లోనే ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

Balaraju Goud

|

Jan 21, 2021 | 8:23 PM

AP Government vs SEC on Local elections:  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కరోనా వైరస్ మహమ్మారి కట్టడి లోనే ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 49,483 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 139 మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఇవాళ ఒక్కరూ కూడా కరోనా కారణంగా ప్రాణాలను కోల్పోలేదని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇక, ఇప్పటి వరకూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 8,74,998 కి చేరింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 1,522 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. కాగా, కోవిడ్ వాక్సిన్ అందుబాటులోకి రావడంతో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వైద్య నిపుణులు భావిస్తున్నారు.

ఇదిలావుంటే, స్థానిక సంస్థల ఎన్నికలకు కరోనా కేసులతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముడిపెడుతోంది. కరోనా పాజిటివ్ కేసుల దృష్ట్యా లోకల్ బాడీ ఎన్నికలను వాయిదా వేయాలని ప్రభుత్వం వాదిస్తోంది. కేసుల తీవ్రత అంతగా లేదు. క్రమంగా పాజిటివ్ సంఖ్య క్రమంగా తుగ్గుతోంది. ఎన్నికలు వాయిదా వేయాల్సిన అవసరం లేదనేది విపక్షాల మాట. విషయం ఏదైనా ఇప్పుడు హైకోర్టు ఎన్నికల నిర్వహణ వైపే మొగ్గు చూపింది. ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ధర్మాసనం. అయితే దీన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

దీంతో ఇప్పుడీ ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. కేసుల తీవ్రత అంతగా లేదు కాబట్టి ఎన్నికల నిర్వహణ వైపే సుప్రీంకోర్టు మొగ్గు చూపవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే కేరళ, కర్నాటక రాష్ట్రాల నుంచి వచ్చిన కేసుల్లో ఇదే తరహా తీర్పు రావడమే ఇందుకు కారణం.

ఇలాంటి సమయంలో అసలు ఏపీలో కరోనా కేసుల తీవ్రత ఎలా ఉందో పరిశీలిద్దాం…

ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,86,418
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా మృతులు 7,142
జూలై-అక్టోబర్‌ మధ్యలో అత్యధిక కేసులు నమోదు
01-09-2020న అత్యధికంగా కేసులు నమోదు 10,368
01-07-2020న కేసులు 657
01-08-2020న  కేసులు 9,276
01-09-2020న కేసులు 10,368
01-10-2020న కేసులు 6,751
01-11-2020న కేసులు 2,618
01-12-2020న కేసులు 685
2021 జనవరి 20న కేసులు 173

ఇక, జనవరి 1 నుంచీ నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే…

కేసులు మరణాలు
01-01-2021 338 4
02-01-2021 564 3
03-01-2021 232 4
04-01-2021 128 3
05-01-2021 377 4
06-01-2021 289 3
07-01-2021 295 1
08-01-2021 319 1
09-01-2021 199 1
10-01-2021 227 1
11-01-2021 121 2
12-01-2021 197 2
13-01-2021 203 1
14-01-2021 179 4
15-01-2021 94 1
16-01-2021 114 0
17-01-2021 161 1
18-01-2021 81 1
19-01-2021 179 1
20-01-2021 173 0

Read Also… స్థానిక ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఇటు అధికారులతో ఎస్ఈసీ భేటీ.. అటు సుప్రీంకు ఏపీ సర్కార్..!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu