AndhraPradesh: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్.. ఆ నియామకాలు నిలుపుదల.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన న్యాయస్థానం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. గ్రేడ్ 2 ఎక్స్ టెన్షన్ అధికారుల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. దీంతో ఎక్స్ టెన్షన్ ఆఫీసర్స్..

AndhraPradesh: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్.. ఆ నియామకాలు నిలుపుదల.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన న్యాయస్థానం..
Ap High Court
Follow us

|

Updated on: Sep 29, 2022 | 7:45 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. గ్రేడ్ 2 ఎక్స్ టెన్షన్ అధికారుల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. దీంతో ఎక్స్ టెన్షన్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 నియామకాలు తాత్కలికంగా నిలిచిపోనున్నాయి. ఈ ప్రక్రియను నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం 560 గ్రేడ్ 2 పోస్టుల నియామకాలకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత పరీక్షలు రాసిన38 వేల మంది అంగన్ వాడీ టీచర్లకు మౌఖిక పరీక్షలు నిర్వహించకుండానే కొందరిని సెలక్ట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యంపై సెప్టెంబర్ 29వ తేదీ గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటీషనర్ తరపున సీనియర్ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. 45 మార్కులకు రాత పరీక్ష , 5 మార్కులకు మౌఖిక పరీక్ష నిర్వహించాల్సి ఉందని పిటిషనర్ తరపున న్యాయవాది వాదించారు. అయితే రాత పరీక్ష నిర్వహించిన అధికారులు ..మౌఖిక పరీక్ష నిర్వహించకుండానే కొందరిని నియమించేందుకు చర్యలు చేపడుతున్నారని, ఉద్యోగాల భర్తీల్లో అవకతవకలు జరిగాయని పిటిషనర్ తరపున న్యాయవాది శ్రవణ్ కుమార్ కోర్టుకు తెలిపారు.

వాదనలు విన్న న్యాయస్థానం పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలతో ఏకీభవించింది. దీంతో ఎక్స్ టెన్షన్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 నియామకాల ప్రక్రియను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం.

ఇలా ఉండగా.. రెండు రోజుల క్రితం మహిళ, శిశు సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించి.. అంగన్వాడీ సూపర్ వైజర్ పోస్టుల భర్తీపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 30వ తేదీ లోపు అంగన్వాడీ కేంద్రాల సూపర్‌ వైజర్ల పోస్టుల భర్తీ చేస్తామని సీఏం సమీక్షా సమావేశంలో వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అత్యంత పారదర్శకంగా పరీక్షల ప్రక్రియ నిర్వహిస్తున్నామని అధికారులు కూడా తెలిపారు. ఇంటర్వ్యూలు ముగిశాక మార్కుల జాబితాలను వెల్లడిస్తామని తెలిపారు. అయితే నియామకాల ప్రక్రియను పూర్తిచేయడానికి సీఏం విధించిన గడువుకు ఒక రోజు ముందు ఈ నియామకాల ప్రక్రియను తాత్కలికంగా నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులు జారీచేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..