GO No. 1: జీవో నెంబర్ 1ను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సర్కారుకు ఆదేశాలు..

ఏపీలో జీవో నెంబర్ 1ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సస్పెండ్ చేసింది. జీవో నెంబర్ 1పై సీపీఐ ఏపీ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకష్ణ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. 

GO No. 1: జీవో నెంబర్ 1ను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సర్కారుకు ఆదేశాలు..
AP High Court
Follow us

|

Updated on: Jan 12, 2023 | 7:10 PM

ఏపీలో జీవో నెంబర్ 1ను సస్పెండ్ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 23 వరకు జీవోను సస్పెండ్‌ చేసినట్లుగా కోర్టు పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది. జీవో నెంబర్ 1పై సీపీఐ ఏపీ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకష్ణ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.

ఈ పిటిషన్ పై గురువారం(12 జనవరి) ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. జీవో నెంబర్ 1 పై రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు విన్పించారు. రామకృష్ణ వేసిన ఈ పిల్ పై తమకు సమాచారం లేదన్నారు. నిబంధనల ప్రకారం ఈ కేసు రోస్టర్ లో రావడానికి ఆస్కారం లేదన్నారు. వెకేషన్ బెంచ్ విధాన పరమైన నిర్ణయాలకు సంబంధించిన పిటిషన్లపై విచారించవద్దని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదించారు.

ఇదిలావుంటే, ప్రభుత్వం జారీ చేసిన జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడిన డివిజన్‌ బెంచ్‌.. కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది. కోర్టుతీర్పుపై పిటిషనర్‌ సీపీఐ రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. “మాతో పాటు అన్ని పార్టీలు ప్రజాసంఘాలు జీవోను తప్పుబట్టాయని.. అందుకే తాము హైకోర్ట్ లో పిటిషన్ వేసినట్లుగా తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం జీవోను వెనక్కి తీసుకోవాలన్నారు. పోలీసు ఉన్నతాధికారులు జీవోను సరిగా చదవలేదని మమ్మల్ని విమర్శించారు.. మరి జడ్జి కూడా సరిగా చదవలేదా..? వైసీపీ నేతలు జీవొ నెం 1 ను ఎందుకు ఫాలోకావడంలేదు. టీడిపీతో పాటు ప్రజాసంఘాలు కూడా కోర్టుకు వెళదామనుకున్నాయి మేము త్వరగా వెళ్లాం.”

ఇవి కూడా చదవండి

రోడ్లపై సభలు, ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించడాన్ని నిషేధిస్తూ జనవరి 2న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 1ని తీసుకొచ్చింది. ఈ జీవో నెంబర్ 1 పై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపట్టాయి. విపక్ష పార్టీల సభలు, సమావేశాలు నిర్వహించకుండా ఉండేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను తీసుకు వచ్చిందని ఆరోపణలు గుప్పించాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం