Andhra Pradesh: టీచర్లకు మరో టెన్షన్‌.. నేటి నుంచి కొత్త హాజరు విధానం.. నిమిషం ఆలస్యమైతే అంతే సంగతులు

AP News: ఉపాధ్యాయుల హాజరుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో విద్యార్థులకు నిమిషం నిబంధన అమలు చేసినట్లు ఉపాధ్యాయులకు కూడా నిమిషం నిబంధనను అమలు చేస్తోంది. ఏపీలోని ఉపాధ్యాయులకు మంగళవారం (ఆగస్టు 16) నుంచి ఈ కొత్త

Andhra Pradesh: టీచర్లకు మరో టెన్షన్‌.. నేటి నుంచి కొత్త హాజరు విధానం.. నిమిషం ఆలస్యమైతే అంతే సంగతులు
Ap Teachers Attendence
Follow us

|

Updated on: Aug 16, 2022 | 7:46 AM

AP News: ఉపాధ్యాయుల హాజరుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో విద్యార్థులకు నిమిషం నిబంధన అమలు చేసినట్లు ఉపాధ్యాయులకు కూడా నిమిషం నిబంధనను అమలు చేస్తోంది. ఏపీలోని ఉపాధ్యాయులకు మంగళవారం (ఆగస్టు 16) నుంచి ఈ కొత్త హాజరు విధానం రాబోతుంది. ఇప్పటివరకు ఉన్న బయోమెట్రిక్, ఐరిష్‌ హాజరు విధానం స్థానంలో ఫేషియల్ రికగ్నిషన్ ను విద్యాశాఖ తీసుకువచ్చింది. ఇందుకోసం సిమ్స్ ఏపీ అనే మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు సహా పాఠశాలలో పనిచేసే వారందరూ ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారానే ఉదయం 9గంటల‌లోపు స్కూల్‌కు వచ్చి ఫొటో తీసుకుని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫొటోనే కదా ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు.. ఆ ఫొటోను అప్ లోడ్ చేస్తే సరిపోతుంది అనుకుంటే మాత్రం పొరపాటే.. కచ్చితంగ పాఠశాలకు వచ్చిన తరువాతనే ఫొటో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఉదయం 9గంటలకు ఒక్క నిమిషం లేట్‌ అయినా ఆ యాప్ ఫొటోను తీసుకోదు. దీంతో ఆరోజు అబ్బెంట్‌ పడినట్లే. లీవ్ పెట్టుకోవాలని యాప్‌ కూడా సూచిస్తుంది. ఎందుకంటే జీపీఎస్ ఆధారంగా పనిచేసే ఈ యాప్‌ ప్రతి పాఠశాలను గుర్తిస్తుంది. ఫొటో ఎక్కడ నుంచి తీసుకున్నారో ఇట్టే చెప్పేస్తుంది. కాబట్టి ఎలాగైనా 9గంటల లోపు పాఠశాలకు వచ్చి పాఠశాల ఆవరణలోనే ఫొటో తీసుకుని అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

కాగా ఏపీ విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి.   పట్టణ ప్రాంతాలు, పట్టణాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇబ్బందులు తప్పవన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంటర్నెట్‌ సరిగా లేకపోతే ఏం చేయాలని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సిమ్స్ యాప్ ను డౌన్‌లోడ్‌ చేసుకోవద్దని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ప్యాప్టో) ఉపాధ్యాయులకు సూచించింది. అయితే ఏపీ విద్యాశాఖ మాత్రం నేటినుంచే దీనిని అమల్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి