ఉద్యోగుల ఎంపిక కోసం జిల్లా ఎంపిక కమిటీలో మార్పులు

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఎంపిక కోసం జిల్లా ఎంపిక కమిటీలో మార్పులు చేస్తూ ఆంధ్రప్రదేవ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ఎస్పీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీలో..

  • Sanjay Kasula
  • Publish Date - 7:03 pm, Tue, 25 August 20
ఉద్యోగుల ఎంపిక కోసం జిల్లా ఎంపిక కమిటీలో మార్పులు

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఎంపిక కోసం జిల్లా ఎంపిక కమిటీలో మార్పులు చేస్తూ ఆంధ్రప్రదేవ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ఎస్పీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీలో నూతనంగా బాధ్యతలు అప్పగించిన జాయింట్ కలెక్టర్లను ఉపాధ్యక్షులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

గ్రామ,వార్డు సచివాలయ జేసీలతో పాటు రైతు భరోసా, రెవెన్యూ జేసీలను కూడా డిస్టిక్ట్ సెలెక్షన్ కమిటీలో నియమిస్తూ ఆదేశించింది. సంక్షేమ బాధ్యతలు చూసే మరో జేసీని డిస్టిక్ట్ సెలెక్షన్ కమిటీలో సభ్యుడిగా నియమించింది. వివిధ శాఖల ఉన్నతాధికారులను జిల్లా ఎంపిక కమిటీలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో జరగనున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరీక్షలను జిల్లా ఎంపిక కమిటీ పర్యవేక్షించనుంది.