ఏపీ స్థానిక ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠ.. సుప్రీంకోర్టుకు చేరిన “పంచాయతీ”.. బిగ్ మండేలో ఏం తేలనుంది..?

రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య నెలకొన్న వివాదం.. పెద్ద యుద్ధాన్నే తలపిస్తోంది.

ఏపీ స్థానిక ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠ.. సుప్రీంకోర్టుకు చేరిన పంచాయతీ.. బిగ్ మండేలో ఏం తేలనుంది..?
Follow us

|

Updated on: Jan 24, 2021 | 3:23 PM

AP local polls tenssio : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు అనేక మలుపులు తిరుగుతూ సుప్రీంకోర్టుకు చేరింది. గంటకు గంటకు.. నిమిష నిమిషానికి అన్నట్టుగా రెండిటి మధ్య వ్యవహారాలు సాగుతున్నాయి. ట్విస్టులు, గందరగోళాల మధ్య రేపు ఏం తేలబోతుందన్నది. సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య నెలకొన్న వివాదం.. పెద్ద యుద్ధాన్నే తలపిస్తోంది.

పంచాయితీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికలు నిర్వమించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అదే బాటలో ఉద్యోగసంఘాలు కూడా మరో పిటిషన్‌ను వేశాయి. ఈ రెండు కేసులను రేపు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఒకే ఇష్యూకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు కావడంతో.. అవి జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌కౌల్‌ ధర్మాసనానికి బదిలీ అయ్యాయి.

కరోనా మహమ్మారి ఓవైపు, విరుగుడు కోసం కొనసాగుతున్న వ్యాక్సిన్‌ మరోవైపు ఉన్న నేపథ్యంలో.. ఎన్నికలను నిర్వహించలేమని ప్రభుత్వం తెగేసి చెబుతోంది. ఏకకాలంలో ఎన్నికలు, వ్యాక్సినేషన్‌ అంటే తమ వల్ల కాదని అంటోంది. ఉద్యోగులు, పోలీసులు విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది కాబట్టి, వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే వరకు ఎన్నికలను వాయిదా వేయాలని ప్రభుత్వం కోరుతోంది. ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ మధ్య తాము నలిగిపోతున్నామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

కరోనా నుంచి రక్షణ పొందేందుకు చేపట్టిన టీకా కార్యక్రమం పూర్తికాకుండా ఎన్నికల విధుల్లో తాము కూడా పాల్గొనలేమని ఉద్యోగులు చెబుతున్నారు. బలవంతంగా తమతో ఎన్నికలను నిర్వహించడం అంటే రాజ్యాంగం ప్రసాదించిన హక్కుకు భంగం కల్గించడమే అని అంటున్నారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్‌తో పాటు నోటిఫికేషన్‌ కూడా జారీ కావడంతో.. చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒకవేళ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు.

మరోవైపు, ఏపీ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. 2019 ఎలక్టోరల్‌ రూల్స్‌ ప్రకారం ఎన్నికలు జరగడం వల్ల 3 లక్షల 60 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోతారంటూ గుంటూరుకు చెందిన అఖిల పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికలు ఏ విధంగానైనా నిర్వహించి తీరుతామంటూ దూకుడు మీదున్న ఎన్నికల సంఘానికి ఇదేమైనా అవరోధంగా మారనుందా? అన్న సందేహాలూ తలెత్తుతున్నాయి.

ఇదిలావుంటే… మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆదివారం షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 21, 28 తేదీలలో.. రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు గుజరాత్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. దీంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల నిలుపుదలను కోరుతూ ఏపీ సర్కార్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది. దీంతో రేపు ఏం జరగబోతుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Read Also… సర్కారుకి చెడ్డపేరు తీసుకురావాలన్నదే ఎస్ఈసీ లక్ష్యం, నిమ్మగడ్డపై దాడిచేయాల్సిన అవసరం నాకు లేదు : వెంకట్రామిరెడ్డి

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..