Andhra-Odisha Border: ఒడిశా సర్కార్‌పై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం.. ఆ ఎమ్మార్వోపై కేసు పెట్టాలని పోలీసులకు ఆదేశం

ఒడిశా సర్కార్‌పై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిహద్దు గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు సీజ్‌ చేయడంపై సీరియస్‌ అయింది. మాణిక్య పట్నం గ్రామాన్ని మంత్రి అప్పలరాజు సందర్శించారు.

Andhra-Odisha Border: ఒడిశా సర్కార్‌పై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం.. ఆ ఎమ్మార్వోపై కేసు పెట్టాలని పోలీసులకు ఆదేశం
Andhra Odisha Border
Follow us

|

Updated on: Sep 09, 2021 | 1:47 PM

ఒడిశా సర్కార్‌పై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిహద్దు గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు సీజ్‌ చేయడంపై సీరియస్‌ అయింది. మాణిక్య పట్నం గ్రామాన్ని మంత్రి అప్పలరాజు సందర్శించారు. ఒడిశా అరాచకాలపై మౌనంగా ఉండడంపై పోలీసులు, రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని సీజ్‌ చేసిన ఒడిశా ఎమ్మార్వోపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఈ వివాదం నెలకొన్నప్పటి నుంచి ఆంధ్రా భూభాగంలో ఒడిషా టెర్రర్ సృష్టిస్తోంది. సరిహద్దు గ్రామాల్లో పెత్తనం కోసం దౌర్జన్యం చేస్తోంది. ఏవోబీలో ఆధిపత్యం కోసం అడ్డగోలుగా ప్రవర్తిస్తోంది. ఒడిషా దుందుడుకు చర్యలతో ఆంధ్రా-ఒడిషా బోర్డర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు గ్రామాలను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఒడిషా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా మందస మండలం మాణిక్యపట్నం గ్రామంలో అంగన్ వాడీ కేంద్రాన్ని ఒడిషా పోలీసులు సీజ్ చేశారు. అడ్డుకోబోయిన అంగన్ వాడీ కార్యకర్త భర్త గుర్నాథాన్ని అరెస్ట్ సైతం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోనే కాదు… విజయనగరం జిల్లాలో ఇదే తరహా దౌర్జన్యానికి పాల్పడింది ఒడిషా అధికారులు.

ఒడిషా దౌర్జన్యాలపై మాణిక్యపట్నం గ్రామస్తులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. తమ గ్రామస్తుడ్ని అరెస్ట్ చేయడంపై భగ్గుమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జోక్యం చేసుకుని ఒడిషా నుంచి తమకు శాశ్వత విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు

అసలు, వివాదమేంటి? ఒడిషా ఎందుకు ఆంధ్రా భూభాగంలో పెత్తనం కోసం ప్రయత్నిస్తోంది? ఆంధ్రా-ఒడిషా సరిహద్దు గ్రామాలపై దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది. ఆ గ్రామాలు తమవంటే తమవంటున్నాయి ఏపీ, ఒడిషా. అటు ఒడిషా… ఇటు ఏపీ… రెండూ కూడా ఆయా గ్రామాలపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఏవోబీ గ్రామాల ఇష్యూపై సుప్రీంకోర్టుకు సైతం వెళ్లారు. పార్లమెంట్ పరిశీలనలోకి కూడా వెళ్లింది.

సుప్రీంకోర్టు అండ్ పార్లమెంట్ పరిశీలనలో ఉండగానే ఏవోబీ గ్రామాల్లో ఒడిషా పెత్తనం ప్రయత్నిస్తోంది. సరిహద్దు రాళ్లను మార్చేస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతోంది. అయితే, 1994 రికార్డ్స్ ప్రకారం అంగన్‌వాడీ కేంద్రం ఉన్న ప్రాంతం తమదేనంటూ క్లెయిమ్ చేస్తోంది ఒడిషా.

ఇవి కూడా చదవండి: Apple Ice Cream : రుచికరమైన యాపిల్ ఐస్ క్రీమ్‌ను ఇంట్లో ప్రయత్నించి చూడండి.. చాలా ఈజీ..

China-taliban: తాలిబన్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న డ్రాగన్ కంట్రీ.. భారీగా ఆర్ధిక సహాయం..

తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి