APSRTC Employees: ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన జగన్‌ సర్కార్‌.. ఇకపై ఎంప్లాయిస్‌ అందరికీ..

APSRTC Employees: ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీఎస్‌ ఆర్టీసీలో విధులు నిర్వర్తిస్తోన్న ఉద్యోగులందరికీ ప్రమాద భీమా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ అవకాశాన్ని...

APSRTC Employees: ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన జగన్‌ సర్కార్‌.. ఇకపై ఎంప్లాయిస్‌ అందరికీ..
Apsrtc Employees
Follow us

|

Updated on: Jul 29, 2021 | 7:45 AM

APSRTC Employees: ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీఎస్‌ ఆర్టీసీలో విధులు నిర్వర్తిస్తోన్న ఉద్యోగులందరికీ ప్రమాద భీమా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ అవకాశాన్ని ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ ఎండి ద్వారకా తిరుమల రావు తెలిపారు. ఈ భీమా సదుపాయాన్ని అమలు చేయడం కోసం ప్రభుత్వం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులతో ఒప్పందం చేసుకుందని ఎండి తెలిపారు.

ఈ భీమా సదుపాయం ద్వారా ఉద్యోగులకు ప్రమాద బీమా ద్వారా రూ. 40 నుంచి రూ. 50 లక్షల వరకు అందుతుందన్నారు. విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగులకు ఈ మొత్తాన్ని అందిస్తారు. అలాగే సహజ మరణం చెందిన వారికి కూడా ఆర్థికంగా ఆదుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగి ఎవరైనా సహజ మరణం పొందితే రూ. 5 లక్షలతో పాటు వారి పిల్లల చదువుకు కూడ సహాయం అందిస్తామని ఎండీ ద్వారకా తిరుమల రావు వివరించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో సంతోషం వెల్లు విరుస్తోంది. ఇదిలా ఉంటే ఆర్టీసీ ఉద్యోగులకు కరోనా బీమా కింద రూ. 50 లక్షలు వర్తింపజేయాలని గతంలో కార్మికులు డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే.

Also Read: Children Repair Road: చిట్టి చేతులు పెద్ద పనులు చేశాయి.. వ్యవస్థనే కదిలించేలా చేశాయి. ఏం చేశారో చూడండి..

Global Tiger Day: రాత్రుల్లో మనుషుల కంటే పులులు ఆరు రెట్లు బాగా చూడగలవు.. టైగర్స్‌ గురించి ఆసక్తికర విషయాలు..!

Jagananna Vidya Deevena: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. నేడు జగనన్న విద్యా దీవెన రెండో విడత డబ్బులు జమ..!