Ration Door Delivery: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేషన్ డోర్ డెలివరీ విధి విధానాలు ఖరారు..

Ration Door Delivery: రేషన్ డోర్ డెలివరీ పధకానికి సంబంధించి విధివిధానాలను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. త్వరలోనే దేశవ్యాప్తంగా...

Ration Door Delivery: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేషన్ డోర్ డెలివరీ విధి విధానాలు ఖరారు..
Follow us

|

Updated on: Feb 12, 2021 | 7:58 AM

Ration Door Delivery: రేషన్ డోర్ డెలివరీ పధకానికి సంబంధించి విధివిధానాలను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. త్వరలోనే దేశవ్యాప్తంగా ‘వన్ నేషన్-వన్ రేషన్’ అమలులోకి వస్తుండటంతో ఇతర రాష్ట్రాలకు చెందిన NFSC కార్డుదారులకు కూడా పోర్టబులిటీ విధానంలో రేషన్ పొందే అవకాశాన్ని కల్పించనున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే దిశగా జగన్ సర్కార్ ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది.

ఫోన్ సిగ్నల్‌లు లేని ప్రాంతాల్లో ఆఫ్‌లైన్ పద్దతిలో రేషన్ సరుకులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడమే కాకుండా ఇకపై కార్డుదారులు రాష్ట్రంలోని ఏ మొబైల్ వాహనం నుంచైనా సరుకులు పొందేలా ఏపీ ప్రభుత్వం అవకాశాన్ని కల్పిస్తోంది. రేషన్ సరుకల వాహనం ఎప్పుడు వస్తుందో తెలిసేలా మ్యాపింగ్ కార్డులకు రిజిస్టర్ అయిన వాలంటీర్లకు మెసేజ్‌లు పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే మొబైల్ వాహనం అన్ని వీధులు తిరిగేలా చూడాలని ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్ వేలిముద్రలతో సరుకులు జారీ చేసే అవకాశాన్ని కల్పించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

మరిన్ని చదవండి:

12 ఏళ్ల బుడతడు.. స్టాక్ మార్కెట్‌లో ఏకంగా రూ. 16 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే.!

ఫస్ట్ నైట్ రోజు భార్యను పట్టించుకోకుండా.. కంప్యూటర్‌తో.. నెట్టింట్లో రచ్చ.. రచ్చ..

డబ్బు పొదుపు చేయాలని చూస్తున్నారా ? నెలకు రూ. 10,000 పెట్టుబడి పెడితే.. రూ. 16 లక్షలు పొందొచ్చు. వివరాలు ఇవే.