మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయండి…కృష్ణా జిల్లా ఎస్పీకి ఎస్ఈసీ ఆదేశాలు..

ఎస్‌ఈసీ వర్సెస్‌ మంత్రి కొడాలి నాని. ఎస్‌..ఇప్పుడు వీరిద్దరి మధ్యే పంచాయితీ నడుస్తోంది. ఈ నెల 21 వరకు మీడియాతో మాట్లాడొద్దని కొడాలి నానిని ఆదేశించారు నిమ్మగడ్డ. ..

మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయండి...కృష్ణా జిల్లా ఎస్పీకి ఎస్ఈసీ ఆదేశాలు..
Sanjay Kasula

|

Feb 13, 2021 | 1:25 PM

SEC Nimmagadda on Kodali Nani : ఎస్‌ఈసీ వర్సెస్‌ మంత్రి కొడాలి నాని. ఎస్‌..ఇప్పుడు వీరిద్దరి మధ్యే పంచాయితీ నడుస్తోంది. ఈ నెల 21 వరకు మీడియాతో మాట్లాడొద్దని కొడాలి నానిని ఆదేశించారు నిమ్మగడ్డ. ఐతే ఎస్‌ఈసీ ఆదేశాలను సవాల్‌ చేస్తూ హైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు మంత్రి కొడాలి. లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేసేందుకు రెడీ అయ్యారు. ఐతే ఇంతలోనే యాక్షన్‌లోకి దిగిపోయారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ. మంత్రిపై కేసు నమోదు చేయాలని కృష్ణాజిల్లా ఎస్సీకి కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఎన్నికల ప్రక్రియలో ఎస్‌ఈసీ విధులకు ఆటంకం కలిగించారని ఆరోపించారు. అంతేకాదు. ఏఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలో కూడా సూచించారు. 504, 505(1)(సీ), 506 సెక్షన్ల కింద కొడాలి నానిపై కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినందుకు క్లాజ్‌-1, క్లాజ్‌-4 కింద కేసు నమోదు చేయాలని తెలిపింది. ఎన్నికల కమిషన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ఎస్‌ఈసీ, కొడాలి నాని మధ్య అసలేం జరిగింది..?

నిన్న మంత్రి కొడాలి నాని ప్రెస్‌మీట్‌లో..తనపై హాట్‌ కామెంట్స్‌ చేశారంటూ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు ఎస్ఈసీ. అంతేకాదు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఐతే నిమ్మగడ్డ పెట్టిన డెడ్‌లైన్‌కు రెండు గంటల ముందే వివరణ ఇచ్చారు నాని. ప్రెస్‌మీట్‌లో తానెక్కడా ఎన్నికల కమిషన్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఎలాంటి దురుద్దేశ వ్యాఖ్యలు కూడా చేయలేదన్నారు. తొలి దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపైనే తాను మాట్లాడానని, ప్రతిపక్షాల వ్యాఖ్యలపైనే తాను విమర్శలు చేశానన్నారు. తన వివరణను పరిశీలించి షోకాజ్‌ నోటీసును వెనక్కి తీసుకోవాలని ఎస్ఈసీని కోరారు.

ఇవి కూడా చదవండి :

AP Panchayat Elections 2021 Live Updates : ఏపీ పల్లె పోరు.. కొనసాగుతున్న రెండో విడత ఎన్నికలు‌.. ఉదయం 10:30 వరకు 37.67 శాతం పోలింగ్

Rinku Sharma Murder: భజరంగ్‌దళ్‌ కార్యకర్త రింకు శర్మ హత్య కేసు ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌కు బదిలీ

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu