Adimulapu Suresh: ఆన్‌లైన్ టీచింగ్ అవసరాన్ని కరోనా గుర్తు చేసింది… త్వరలో కీలక నిర్ణయం

అమ్మ ఒడిలో భాగంగా దాదాపు 10 లక్షల మంది ల్యాప్ టాప్స్ కావాలని కోరారని ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. వారికి వెంటనే హై ఎండ్ ల్యాప్ టాప్స్ అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించినట్లుగా...

Adimulapu Suresh: ఆన్‌లైన్ టీచింగ్ అవసరాన్ని కరోనా గుర్తు చేసింది... త్వరలో కీలక నిర్ణయం
Adimulapu Suresh
Follow us

|

Updated on: Jun 15, 2021 | 3:57 PM

ఆన్‌లైన్ టీచింగ్ అవసరాన్ని కరోనా గర్తు చేసిందని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ అన్నారు. వృత్తి విద్యా కోర్సులకు ఆన్లైన్ టీచింగ్ అందుబాటులో ఉందన్నారు.  నూతన విద్యా విధానం పై  మంత్రి ఆదిమూలపు సురేష్‌ టీవీ9 తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇక ఆన్ లైన్ టీచింగ్ పై ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వాల్సి అవసరముందని అభిప్రాయ పడ్డారు. అంతే కాదు ఆన్ లైన్ క్లాసులను పిల్లలు గ్రహిస్తారా లేదా అనే అంశం పై కూడా కసరత్తు మొదలు పెట్టామన్నారు. ఆన్ లైన్ క్లాసులు నిర్వహణ పై ఇప్పటికే సర్వే నిర్వహించామన్నారు.

అమ్మ ఒడిలో భాగంగా దాదాపు 10 లక్షల మంది ల్యాప్ టాప్స్ కావాలని కోరారని ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. వారికి వెంటనే హై ఎండ్ ల్యాప్ టాప్స్ అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించినట్లుగా తెలిపారు. అయితే.. రాష్ట్రంలో 0.2 శాతం కంటే తక్కువ మందికి మాత్రమే ల్యాప్ టాప్స్ ఉన్నాయి. దాదాపు 25 శాతం మంది విద్యార్థులకు టీవీ కూడా అందుబాటులో లేదన్నారు. మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని.. ఈ అంశం పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు.

ఇక స్కూల్ ఎక్కువ దూరం ఉంటే డ్రాప్ అవుట్స్ ఉండే అవకాశం ఉంటుందని.. ఇలాంటి పరిస్థితి రాకుండా…కేవలం 1 నుండి 1.5 కిలో మీటర్ల కు మించి దూరం లేకుండా స్కూల్స్ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని అన్నారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని మంత్రి ఆదిమూల‌పు సురేష్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి : Modi Cabinet Expansion Buzz: త్వరలో కేంద్ర కేబినెట్‌లోకి పవన్ కళ్యాణ్..! వేగంగా మారుతున్న ఢిల్లీ రాజకీయాలు..!

Pranahita-Godavari Basin : ప్రాణహిత-గోదావరి బేసిన్‌‌కు సరికొత్త చరిత్ర.. 240 మిలియన్ ఏళ్ల నాటి జీవజాతిని గుర్తించిన ఐఎస్‌ఐ..

వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..