AP News: ఆ సమస్య రాకూడదనే మూడు రాజధానులు.. ఉపముఖ్యమంత్రి ధర్మాన సెన్సేషనల్ కామెంట్స్

ఏపీలో హాట్ టాపిక్ గా మారిన క్యాపిటల్(Capital) అంశంపై అధికార నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్(Dharmana Krishnadas) మూడు రాజధానులపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన జరిగితే...

AP News: ఆ సమస్య రాకూడదనే మూడు రాజధానులు.. ఉపముఖ్యమంత్రి ధర్మాన సెన్సేషనల్ కామెంట్స్
Dharmana
Follow us

|

Updated on: Mar 07, 2022 | 9:48 AM

ఏపీలో హాట్ టాపిక్ గా మారిన క్యాపిటల్(Capital) అంశంపై అధికార నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్(Dharmana Krishnadas) మూడు రాజధానులపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన జరిగితే మళ్లీ రాజధాని సమస్య ఎదురవుతుందని, అందుకే మూడు రాజధానుల అవసరం ఉందని చెప్పారు. అరవై ఏళ్ల పాటు అభివృద్ధి చేసిన హైదరాబాద్‌(Hyderabad)ను విభజన వల్ల కోల్పోయామని, మళ్లీ అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు మూడు రాజధానుల అవసరం ఉండటం ఎంతైనా ఉందని వెల్లడించారు. రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రానికే ఉందని, పార్లమెంటుకు విరుద్ధంగా వచ్చిన తీర్పుపై విస్తృత చర్చ జరగాలని కోరారు. రాజధాని భూములను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలోనే తనఖా పెట్టారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు స్వార్థపూరితంగా అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉద్యమం వచ్చి విభజన పరిస్థితి ఎదురైతే రాజధాని సమస్య లేకుండా మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

పాలనా వికేంద్రీకరణే తమ ప్రభుత్వ విధానమని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరగాలనేదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వం మూడు రాజధానులకే(Three capitals) కట్టుబడి ఉందని చెప్పారు. ఇదే మాటను ఒకటికి పది సార్లు చెబుతున్నామన్నారు. మూడు రాజధానుల నిర్మాణం తమ పార్టీ విధానమని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలంటే పాలన వికేంద్రీకరణ తప్పనిసరి అని అన్నారు. ప్రతిపక్ష నేతల అభిప్రాయాలు తమ ప్రభుత్వానికి ప్రామాణికం కావని వెల్లడించారు.

ఈ క్రమంలో అమరావతిపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మాస్టర్‌ ప్లాన్‌లో ఉన్నది ఉన్నట్లుగా 6 నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రైతులకు ఇచ్చిన హామీ మేరకు మూడు నెలల్లో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని సూచించింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని వెల్లడించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని సూచించింది. అమరావతి కోసం సేకరించిన భూములను రాజధాని అవసరాలకే వినియోగించాలని ఆదేశించింది. అంతేకాకుండా అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

Also Read

Malayalam Director: ఫస్ట్ మూవీ రిలీజ్ కాకుండానే లైంగిక వేధింపుల కేసులతో డైరెక్టర్ అరెస్ట్.. నేడు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు

Bollywood : జోరు పెంచిన బాలీవుడ్ స్టార్స్.. వరుసగా బడా సినిమాలను లైన్ లో పెట్టిన హీరోలు

Multibagger Stock: వారెవ్వా ఏమి స్టాక్.. ఇన్వెస్టర్లకు కనకవర్షం.. రూ.1.22 లక్షల పెట్టుబడిని రూ. 88 లక్షలుగా మార్చేసింది..