Ap Corona Updates: ఏపీలో పెరిగిన కరోనా పాజిటివ్‌ కేసులు.. పెరుగుతున్న రికవరీ రేటు.. మరణాలు ఎన్ని అంటే..

Ap Corona Updates: ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ అమలు చేయడం వల్ల కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం..

Ap Corona Updates: ఏపీలో పెరిగిన కరోనా పాజిటివ్‌ కేసులు.. పెరుగుతున్న రికవరీ రేటు.. మరణాలు ఎన్ని అంటే..
Ap Corona
Follow us

|

Updated on: Aug 24, 2021 | 6:04 PM

Ap Corona Updates: ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ అమలు చేయడం వల్ల కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా అన్ని రంగాలు తెరుచుకుని తమ తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో నిన్నటి కంటే ఈ రోజు పాజిటివ్‌ కేసులు పెరిగాయి. నిన్న 1002 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 58,890 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 1248 పాజిటివ్‌ కేసులు బయట పడ్డాయి. ఇక తాజాగా 15 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో పాజిటివ్‌ రేటు 2.1శాతం ఉండగా, మరణాల రేటు 0.68 శాతం ఉంది.

తాజాగా చిత్తూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, తూర్పు గోదావరిలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, కర్నూలు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మొత్తం 15 మంది మరణించారు.

అలాగే అత్యధిక పాజిటివ్‌ కేసులు చిత్తూరు జిల్లాలో 166 నమోదు అయినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 13677 ఉండగా, గడిచిన 24 గంటల్లో 1715 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 13750 మృతి చెందారు. ఇక మొత్తం రికవరీ కేసులు 19.77 లక్షల మంది ఉన్నారు. రివకరీ శాతం 98.5 శాతం ఉంది.

కాగా, దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి అదుపులోకి వచ్చినట్లే కన్పిస్తోంది. క్రియాశీల రేటు తగ్గడం.. రికవరీ రేటు మెరుగ్గా ఉండటం కొంత ఊరటనిస్తోంది. యాక్టివ్‌ కేసుల రేటు 1శాతం దిగువకు పడిపోయింది. అటు కొత్త కేసులు కూడా భారీగా తగ్గుముఖం పట్టడం ఊరట కలిగిస్తోంది. కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య దాదాపు 50 శాతం ఎక్కువగా ఉంది.

దేశంలో కొత్తగా 25,467 మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.24కోట్లకు చేరింది. ఇదే సమయంలో మరో 39,486 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.17కోట్ల మంది వైరస్‌ను జయించగా.. రికవరీ రేటు 97.68శాతానికి పెరిగింది.

కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో యాక్టివ్‌ కేసులు గణనీయంగా పడిపోయాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,19,551 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 0.98 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 354 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు దేశంలో 4,35,110 మందిని కరోనా బలితీసుకుంది. ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోంది. సోమవారం 63,85,298 మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు 58.89 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇవీ కూడా చదవండి: న్యూజిలాండ్ లో ఒక్క రోజులో పెరిగిన కోవిడ్-19 కేసులు..గత ఏడాది ఏప్రిల్ తరువాత తొలిసారిగా..

Corona Third Wave: విద్యాసంస్థల రీఓపెనింగ్‌కు థర్డ్ వేవ్ టెన్షన్.. అయినా అదొక్కటే ఊరట..!

శ్రీకృష్ణుడ్ని ఆరాధిస్తూ విగ్రహాన్ని పెళ్లి చేసుకున్న యువతి..
శ్రీకృష్ణుడ్ని ఆరాధిస్తూ విగ్రహాన్ని పెళ్లి చేసుకున్న యువతి..
చెన్నైకే కాదు, శాంసన్‌కు ఇచ్చిపడేసిన లక్నో సారథి
చెన్నైకే కాదు, శాంసన్‌కు ఇచ్చిపడేసిన లక్నో సారథి
శనిలా దాపురించారు.. మీ ఆటకో దండం సామీ.. ఈ ప్లేయర్లు ఉన్న జట్లు.!
శనిలా దాపురించారు.. మీ ఆటకో దండం సామీ.. ఈ ప్లేయర్లు ఉన్న జట్లు.!
తులసి మొక్క దగ్గర ఈ వస్తువులు పెడుతున్నారా.? ఇబ్బందులు తప్పవు
తులసి మొక్క దగ్గర ఈ వస్తువులు పెడుతున్నారా.? ఇబ్బందులు తప్పవు
పుష్పరాజ్‏గా ఇరగదీసిన బుడ్డోడు.. చూస్తే గూస్ బంప్సే...
పుష్పరాజ్‏గా ఇరగదీసిన బుడ్డోడు.. చూస్తే గూస్ బంప్సే...
ఇదేం ఖర్మరా బాబూ.. గెలిచినోడికి, ఓడినోడికి కూడా నిరాశేనా..
ఇదేం ఖర్మరా బాబూ.. గెలిచినోడికి, ఓడినోడికి కూడా నిరాశేనా..
ఆమెతో సినిమా చేయడమే వేస్ట్.. ఐరెన్ లెగ్ అంటూ విమర్శలు..
ఆమెతో సినిమా చేయడమే వేస్ట్.. ఐరెన్ లెగ్ అంటూ విమర్శలు..
హైదరాబాద్​ ఎంపి అసదుద్దీన్​ ఓవైసీ నామినేషన్.. ఆస్తులు, ఆయుధాలివే
హైదరాబాద్​ ఎంపి అసదుద్దీన్​ ఓవైసీ నామినేషన్.. ఆస్తులు, ఆయుధాలివే
ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం
ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం
తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో
తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.