50 వేలు దిగువకు యాక్టివ్ కేసులు.. 6 జిల్లాల్లో 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు: సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌లో 50 వేల కంటే దిగువకు యాక్టివ్ కేసులు తగ్గాయని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. తాజాగా ఆయన కోవిడ్ నియంత్రణ,..

50 వేలు దిగువకు యాక్టివ్ కేసులు.. 6 జిల్లాల్లో 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు: సీఎం జగన్
Jagan
Follow us

|

Updated on: Jun 25, 2021 | 6:36 PM

ఆంధ్రప్రదేశ్‌లో 50 వేల కంటే దిగువకు యాక్టివ్ కేసులు తగ్గాయని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. తాజాగా ఆయన కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 5.23 శాతంగా ఉందన్న సీఎం.. 6 జిల్లాల్లో(కడప, గుంటూరు, నెల్లూరు, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు) 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు ఉందని తెలిపారు. జాతీయ సగటు కంటే రాష్ట్రంలో అధికంగా రికవరీ రేటు ఉందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 96.59 శాతంగా ఉంటే.. ఏపీలో 96. 67 శాతంగా ఉందని స్పష్టం చేశారు. అలాగే ప్రైవేటు ఆసుపత్రుల్లో అక్యుపై అయిన పడకల్లో 76.51 శాతం పడకల్లో రోగులకు ఆరోగ్య శ్రీ కింద చికిత్స అందిస్తున్నామన్నారు. అటు 104కు గణనీయంగా కాల్స్ రావడం తగ్గాయని.. జూన్ 25న కేవలం 1021 కాల్స్ మాత్రమే వచ్చాయన్నారు.

ఇదిలా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రులు, ఈఎస్ఐ హాస్పిటల్స్‌లో వినియోగించే మందులన్నీ కూడా జీఎంపీ, డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలతో ఉండాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. ఆస్పత్రుల్లో శానిటేషన్, రోగులకు అందించే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధచేపట్టాలని స్పష్టం చేశారు. నిరంతరం మానిటరింగ్‌‌తో పాటు ఆస్పత్రి భవనాల నిర్వహణ, వైద్య పరికరాల నిర్వహణపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలి అధికారులు సీఎం జగన్ తెలిపారు. కాగా, అత్యవసరమైతే తప్ప ప్రజలకు బయటికి వెళ్లొద్దని.. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి తప్పనిసరిగా పాటించాలన్నారు.

Also Read:

ఇంటి పైకప్పు తుడుస్తుండగా వర్కర్లకు షాక్.. పోలీసుల ఎంట్రీతో వెలుగులోకి విస్తుపోయే విషయాలు.!

 ఆ ఒక్క చేప లక్షలు తెచ్చిపెట్టింది.. ఎంత ధర పలికిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

ఈ వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. మీరూ ఓ లుక్కేయండి.!