ఇరిగేషన్‌శాఖపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌ సమీక్ష

ఇరిగేషన్‌శాఖపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సుమారు 4గంటల పాటు ఈ సమీక్ష జరిగింది. ప్రాజెక్టులపై జిల్లాల వారీగా కమిటీలు, ఒక్కో జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇంజనీరింగ్‌ అధికారులతో కమిటీ వేయనున్నారు. బైరవానితిప్ప, ఎగువ పెన్నా ప్రాజెక్టుల్లో భారీగా అంచనాలు పెంచారని సీఎం అన్నారు. ప్రాజెక్టుల వ్యయాన్ని తగ్గించి డీపీఆర్‌ రూపొందిస్తే అవార్డులు ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టులో డీజిల్‌ కోసం కాంట్రాక్టు సంస్థకు రూ. 50 కోట్లు విడుదల చేశారు. […]

ఇరిగేషన్‌శాఖపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌ సమీక్ష
Follow us

| Edited By:

Updated on: Jun 06, 2019 | 8:20 PM

ఇరిగేషన్‌శాఖపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సుమారు 4గంటల పాటు ఈ సమీక్ష జరిగింది. ప్రాజెక్టులపై జిల్లాల వారీగా కమిటీలు, ఒక్కో జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇంజనీరింగ్‌ అధికారులతో కమిటీ వేయనున్నారు. బైరవానితిప్ప, ఎగువ పెన్నా ప్రాజెక్టుల్లో భారీగా అంచనాలు పెంచారని సీఎం అన్నారు. ప్రాజెక్టుల వ్యయాన్ని తగ్గించి డీపీఆర్‌ రూపొందిస్తే అవార్డులు ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టులో డీజిల్‌ కోసం కాంట్రాక్టు సంస్థకు రూ. 50 కోట్లు విడుదల చేశారు. సముద్రంలో కలిసే గోదావరి జలాలకు సంబంధించి మరోమారు నివేదిక ఇచ్చారు. విస్తృతస్థాయి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులకు సీఎం జగన్‌ ఆదేశించారు.