YSR Kapu Nestham: ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. నేడే ఆ లబ్ధిదారుల ఖాతాల్లో రూ.15 వేలు జమ..

కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జరగనున్న కార్యక్రమంలో వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు.

YSR Kapu Nestham: ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. నేడే ఆ లబ్ధిదారుల ఖాతాల్లో రూ.15 వేలు జమ..
Ys Jagan
Follow us

|

Updated on: Jul 29, 2022 | 5:00 AM

YSR Kapu Nestham: ఏపీలోని వైఎస్ జగన్ సర్కార్ ఈ రోజు కాపు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పనుంది. వరసగా మూడో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం నగదును ప్రభుత్వం శుక్రవారం లబ్ధిదారుల ఖాతాలో జమచేయనుంది. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జరగనున్న కార్యక్రమంలో వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి (YS Jagan) కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,38,792 మంది పేద మహిళలకు రూ. 508.18 కోట్ల ఆర్ధిక సాయం అందించనున్నారు. వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం.. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల పేద అక్కచెల్లెమ్మల ఆర్ధికాభివృద్ది, జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వరసగా మూడో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం నగదును జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ పథకాల్లో ఎక్కడా వివక్ష, అవినీతికి తావులేకుండా అర్హత ఉన్న ప్రతీఒక్కరికి పథకం వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇదే విషయంపై.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలుమార్లు మాట్లాడారు. ప్రభుత్వ పథకాల్లో కులం, మతం, రాజకీయాలు, పార్టీలు చూడమంటూ పేర్కొన్నారు. వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్ళ లోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద మహిళలకు ఏటా రూ. 15 వేల చొప్పున 5 ఏళ్ళలో మొత్తం రూ. 75,000 ఆర్ధిక సాయాన్ని జగన్‌ ప్రభుత్వం అందిస్తోంది. అర్హులైన పేద కాపు మహిళలకు నేడు అందిస్తున్న రూ. 508.18 కోట్లతో కలిపి ఇప్పటివరకు కేవలం వైఎస్సార్‌ కాపు నేస్తం క్రింద అందించిన మొత్తం సొమ్ము రూ.1,491.93 కోట్లు. తద్వారా ఒక్కో పేద కాపు అక్క,చెల్లెమ్మకు ఈ మూడేళ్ళలో అందించిన ఆర్ధిక సాయం అక్షరాలా రూ. 45,000గా ప్రభుత్వం పేర్కొంది.

గత ప్రభుత్వ హయాంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు వివిధ రూపాల్లో ఇచ్చింది సగటున ఏడాదికి కేవలం రూ. 400 కోట్లు కూడా లేవని.. జగన్‌ ప్రభుత్వం మూడేళ్ళలోనే వివిధ పథకాల ద్వారా 70,94,881 మంది కాపు కులాల మహిళలకు, పురుషులకు దాదాపు 27 రెట్లు ఎక్కువగా అంటే మొత్తం రూ. 32,296.37 కోట్ల లబ్ది చేకూర్చినట్లు నాయకులు పేర్కొంటున్నారు. ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా కాపుల బలోపేతం కోసం విశేష కృషి, సామాజిక సమతుల్యత పాటిస్తూ కాపులకు ఒక డిప్యూటీ సీఎంతో సహా, ఏకంగా 4 మంత్రి పదవులు కేటాయించినట్లు గుర్తు చేస్తున్నారు. అన్ని నామినేటెడ్‌ పదవులు, స్ధానిక సంస్ధలలో కాపు వర్గాలకు తగు ప్రాధాన్యత ఇచ్చేలా.. మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కాపుల సంక్షేమం కోసం ఇప్పటివరకూ కేవలం మూడేళ్ళలో రూ. 32,296 కోట్ల లబ్ధి చేకూరినట్లు వైసీపీ నాయకులు తెలిపారు..

కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల సంక్షేమం కోసం వివిధ పథకాల ద్వారా అందించిన ఫలాలు..

ఇవి కూడా చదవండి

డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) ద్వారా మూడేళ్ళలో లబ్ధిపొందిన లబ్ధిదారుల వివరాలు.. లబ్ధిదారుల సంఖ్య 57,69,237 మందికి గాను అందిన లబ్ధి రూ. 16,256.44 కోట్లు. నాన్‌ డీబీటీ ద్వారా మూడేళ్ళలో లబ్ధిపొందిన లబ్ధిదారుల వివరాలు.. లబ్ధిదారుల సంఖ్య 13,25,644 మందికి గాను అందిన లబ్ధి రూ. 16,039.93 కోట్లు. మొత్తం డీబీటీ, నాన్‌ డీబీటీ కలిపి లబ్ధిదారుల సంఖ్య 70,94,881 కు గాను రూ. 32,296.37 కోట్ల లబ్ధి చేకూరినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?
ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?
9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ
9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ
వైఎస్ఆర్ ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్..
వైఎస్ఆర్ ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్..
ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా
ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా
షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?
షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ
మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?
ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?
వైఎస్ఆర్ ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్..
వైఎస్ఆర్ ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..