Border villages: మళ్లీ చినికి చినికి గాలివానలా మారుతోన్న సరిహద్దు గ్రామాల వివాదం

సరిహద్దు గ్రామాల వివాదం మళ్లీ చినికి చినికి గాలివానలా మారుతోంది. ఎప్పటికిప్పుడు ఆధిపత్యం కోసం.. ప్రయత్నిస్తూనే...పోలీసులు, కోర్టుల జోక్యంతో కాస్త వెనక్కి తగ్గుతోంది...

Border villages: మళ్లీ చినికి చినికి గాలివానలా మారుతోన్న సరిహద్దు గ్రామాల వివాదం
Ap Odisha
Follow us

|

Updated on: Jul 10, 2021 | 11:05 PM

Border villages dispute: సరిహద్దు గ్రామాల వివాదం మళ్లీ చినికి చినికి గాలివానలా మారుతోంది. ఎప్పటికిప్పుడు ఆధిపత్యం కోసం.. ప్రయత్నిస్తూనే…పోలీసులు, కోర్టుల జోక్యంతో కాస్త వెనక్కి తగ్గుతోంది. అయితే, తాజాగా ఆంధ్రా- ఒడిశా బోర్డర్‌లో మళ్లీ ఇలాంటి రగడే రాజుకుంది. ఆంధ్రా- ఒడిశా రాష్ట్రాల మధ్య వివాదంగా ఉన్న 21 గ్రామాల పంచాయితీ మరోసారి తెరపైకి వచ్చింది. విజయనగరం జిల్లా కొటియా గ్రామాల్ని తమ సరిహద్దుల్లో కలుపుకునేందుకు ఒడిశా దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే నేరేడువలసలో రాత్రికి రాత్రే ఓ ఆలయ నిర్మాణం చేపట్టింది.

అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర ఆలయ నిర్మాణ పనుల్ని అడ్డుకున్నారు. యధాతధ స్థితిపై సుప్రీం కోర్టు ఆదేశాలున్నప్పటికి వాటిని లెక్క చేయకుండా నిర్మాణాలు ఎలా చేపట్టారంటూ ఒడిశాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే రాజన్నదొర కంప్లైంట్‌తో సీన్‌లోకి ఎంటరైన పోలీసులు తహశీల్దార్ శ్రీనువాసరావు సమక్షంలో ప్రస్తుతం చేపడుతున్న ఆలయ నిర్మాణ పనుల్ని నిలిపివేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా సాలూరు నుంచి సరిగ్గా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నవే కొటియా గ్రామాలు. ఈ గ్రామాల కోసమే ఒడిశా పట్టుబడుతోంది. వీటిని ఎలాగైన సొంతం చేసుకోవాలని ఆరాటపడుతోంది.. సరిహద్దులు దాటొచ్చి.. ఏపీలోకి చొచ్చుకొచ్చి.. ఈ 21 గ్రామాలపై ఒడిశా.. తన అధికారాన్ని బలవంతంగా రుద్దుతోంది. అభివృద్ధి పేరుతో దురాక్రమణ చేస్తోంది. ఇందుకోసం ఇక్కడ భారీగా నిధులు ఖర్చు చేస్తూ తమ ముద్రవేసుకునేందుకు తెగ ప్రయత్నిస్తోంది.

ఇవన్ని ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలో ఉన్న గ్రామాలే అయినప్పటికి సైన్‌ బోర్డుల నుంచీ శిలాఫలకాల వరకూ అన్నీ ఒరియాలోనే ఉంటాయి. ఎక్కాడ తెలుగు ఊసు లేకుండా చేస్తూ వస్తున్నారు ఒడిశా అధికారులు. ఇందులో భాగంగానే మళ్లీ ఇప్పుడు నేరేడువలసలో ఆలయ నిర్మాణం చేపడుతూ దూకుడు పెంచింది ఒడిశా.

Read also: Midhun Reddy: చంద్రబాబు ఆటలు మా వద్ద సాగవు : వైసీపీ ఎంపీలు.. విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..