Amalapuram: అమలాపురం అల్లర్ల కేసులో మరో 18 మంది అరెస్ట్.. ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తప్పవు: పోలీసులు

కోనసీమ జిల్లా పేరుమార్పుపై చెలరేగిన హింసలో, అరెస్టుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా, మరో 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

Amalapuram: అమలాపురం అల్లర్ల కేసులో మరో 18 మంది అరెస్ట్.. ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తప్పవు: పోలీసులు
Amalapuram
Follow us

|

Updated on: Jun 07, 2022 | 7:49 AM

గత నెల 24న అమలాపురంలో జరిగిన అల్లర్ల కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో మరో 18 మందిని అరెస్టు చేశారు పోలీసులు. వీరితో కలిపి ఇప్పటివరకు అరెస్టు అయినవారి సంఖ్య 129కి చేరింది. తాజాగా అరెస్టు చేసిన వారిలో ఇద్దరు రౌడీషీటర్లు గంపా అనిల్, యాళ్లనాగు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. అల్లర్లలో ఎవరి ప్రమేయం ఉన్నా ఊరుకునేదిలేదని స్పష్టం చేస్తున్నారు. కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్‌ జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, దాన్ని వ్యతిరేకిస్తూ అమలాపురంలో అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో మంత్రి పినిపె విశ్వరూప్‌, ఎమ్మెల్యే సతీష్‌ ఇళ్లను ఆందోళనకారులు తగలబెట్టారు. నిరసనకారులు మామూలుగా ధర్నా, రాస్తారోకోలు నిర్వహిస్తారని పోలీసులు భావించారు. కానీ, ఉన్నట్టుండి ఆరోజు నిరసన కారులు రెచ్చిపోయి వాహనాలకు నిప్పుపెట్టారు. అక్కడితో ఆగకుండా, అమలాపురంలోని మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్‌ బాబు ఇళ్లకు నిప్పుపెట్టి నానా బీభత్సం సృష్టించారు. ఒకానొక దశలో పరిస్థితి చేయిదాటి పోవడంతో పోలీసులు లాఠీఛార్జీ చేసి చెదరగొట్టారు.

కాగా, ఈ అల్లర్ల తర్వాత జిల్లాలో కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. కొన్ని రోజులు జిల్లాలో ఇంటర్నెట్‌ను కూడా నిలిపివేశారు. అటు, ఈ అల్లర్లపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. అల్లర్ల వెనుక అధికార పార్టీ ఉందని టీడీపీ, జనసేన ఆరోపిస్తే, పవన్, చంద్రబాబు ప్రోద్బలంతోనే ఈ అల్లర్లు జరిగాయని అధికార వైసీపీ కౌంటర్‌ ఎటాక్‌ చేసింది.