AP Weather: ఓవైపు దూసుకోస్తున్న అల్పపీడనం.. మరోవైపు గజగజలాడిస్తోన్న చలి..

| Edited By: Ram Naramaneni

Dec 14, 2024 | 6:06 PM

ఏపీలో వింత వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు చలి వణికిస్తుంటే.. మరోవైపు అల్పపీడనం దూసుకొస్తోంది. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు.. ప్రజలను అలెర్ట్ చేశారు...

AP Weather: ఓవైపు దూసుకోస్తున్న అల్పపీడనం.. మరోవైపు గజగజలాడిస్తోన్న చలి..
Andhra Weather Report
Follow us on

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత అల్పపీడనం మరింత బలపడి తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉంది. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలను చలి చంపేస్తుంది. సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి ఉష్ణోగ్రతలు. పొగమంచు ప్రభావం విమాన రాకపోకలపై తీవ్రంగా పడుతుంది.. రెండో రోజూ పలు విమానాలు ఆలస్యమయ్యాయి.

ఇటీవలే బంగాళాఖాతంలో అల్పడానికి తమిళనాడుతో పాటు రాయలసీమ దక్షిణ కోస్తా తీవ్రంగా వర్షాలు కురిసాయి. ఆయా ప్రాంతాల్లో పంటలకు కూడా నష్టం వాటిలో ఉంది. ఆ ప్రభావం నుంచి కాస్త ఊపిరి పీల్చుకునేలోపే.. మరో అల్పపీడనం ఉపద్రవం ముంచుకొస్తుంది. దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాలపై ఉపలతల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆదివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది తదుపరి రెండు రోజుల్లో మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం కూడా తమిళనాడు తీరం వైపే కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏపీ, యానాంలపై ఈశాన్య తూర్పు గాలుల ప్రభావం కనిపిస్తోంది. శనివారం నుంచి మూడు రోజులపాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికనుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో ఎల్లుండి నుంచి వస్తారు వర్షం ప్రభావం కనిపిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

గజగజా…

ఇక రెండు తెలుగు రాష్ట్రాలను చలి చంపేస్తుంది. గజగజ వణికిస్తోంది. పగటిపూట ఉష్ణోగ్రతలో క్రమంగా పడిపోతున్నాయి. కొన్నిచోట్ల సింగల్ డిజిట్‌కు పడిపోతున్నాయి ఉష్ణోగ్రతలు. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో భారీగా చలి తీవ్రత కనిపిస్తోంది. దట్టంగా పొగమంచు కురుస్తోంది. మినుములూరులో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. పాడేరు, అరకులలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అవ్వగా.. చింతపల్లి 12.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎముకలు కోరికే చలిలో గిరిజనులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. చలిమంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు. మరోవైపు కూల్ క్లైమేట్‌ను ఆస్వాదించేందుకు పాడేరు ఏజెన్సీకి భారీగా తరలి వెళ్తున్నారు పర్యాటకులు.

విజిబులిటీ లేక విమానాలు ఆలస్యం..

విశాఖ ఎయిర్ పోర్ట్‌పై పొగ మంచు ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. రెండో రోజు కూడా వరుసగా విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. విజిబిలిటీ సరిగా లేక శనివారం ఉదయం మూడు ఇండిగో, ఒక ఎయిర్ ఇండియా విమానం ఆలస్యమైంది. విజిబులిటీ సరిగా లేక ఐదు విమానాలు ఆలస్యమాయ్యాయి. బెంగుళూరు విశాఖ, హైదరాబాద్ విశాఖ, చెన్నై విశాఖ, ఢిల్లీ విశాఖ నాలుగు ఇండిగో విమానాలతో పాటు ఢిల్లీ విశాఖ మరో ఎయిర్ ఇండియా విమానం ఆలస్యమైంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..