Andhrapradesh: అక్కడ గ్రామ సచివాలయ ఉద్యోగుల ఆందోళన.. విధుల బహిష్కరణ

ప్రజలు తమ సమస్యలు విన్నవించి.. పరిష్కరించాలంటూ గ్రామ, వార్డు సచివాలయకు వెళ్లడం సర్వసాధారణంగా చూస్తుంటాం. కాని ఇక్కడ సీన్ రివర్స్ తమ సమస్యలు పరిష్కరించాలంటూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు

Andhrapradesh: అక్కడ గ్రామ సచివాలయ ఉద్యోగుల ఆందోళన.. విధుల బహిష్కరణ
Sachivalayam1
Follow us

|

Updated on: Aug 11, 2022 | 9:05 AM

Andhrapradesh: ప్రజలు తమ సమస్యలు విన్నవించి.. పరిష్కరించాలంటూ గ్రామ, వార్డు సచివాలయకు వెళ్లడం సర్వసాధారణంగా చూస్తుంటాం. కాని ఇక్కడ సీన్ రివర్స్ తమ సమస్యలు పరిష్కరించాలంటూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నిరసన బాటపట్టారు. తమకు కనీస సౌకర్యాలు కల్పించడంలేదని.. స్థానిక నేతల టార్చర్ తట్టుకోలేకపోతున్నామంటూ తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లిలో సచివాలయ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. సొంత భవనం లేకపోయినా, ఇంటర్నెట్ వంటి సమస్యలున్నా.. సర్ధుకుపోతూ ప్రజలకు మెరుగైన సేవలందిస్తుంటే.. తమపై స్థానిక నేతలు అధిమాయిషీ చేస్తున్నారని.. దీంతో తాము తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామంటూ గంగుడుపల్లి సచివాలయ ఉద్యోగులు ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు.

సచివాలయం పరిధిలోని కుటుంబాలకు ఎంత సర్వీస్ చేస్తున్నా.. కొంతమంది లోకల్ లీడర్లు తమ పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తూ.. మద్యం తాగొచ్చి అగౌరవంగా మాట్లాడుతున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కనీసం సచివాలయంలో వాష్ రూమ్ లేదని, దీంతో ఏదైనా అత్యవసరమైతే కిలీమీటర్ మేర వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు పాటించకుండా ఎవరూ పడితే వారు వచ్చి సచివాలయంలో రిజిస్టర్ తనిఖీ చేస్తున్నారని.. ప్రొటోకాల్ పాటించడంలేదని సచివాలయ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారుల జరిగే సమావేశాలకు వెళ్లినా.. సచివాలయాలకు ఎందుకు రావడంలేదంటూ ఫోన్లు చేసి వేధిస్తున్నారని ఏంపీడీవోకు ఫిర్యాదు చేశారు సచివాలయ ఉద్యోగులు. తమ సమస్యలను పరిష్కరించే వరకు విధులకు హాజరుకాబోమంటూ ప్రతిజ్ఞ చేశారు.