AP Elections: మీవేనా ప్రాణాలు.. మావి కాదా?.. ఎన్నికల నోటిఫికేషన్‌పై తీవ్రంగా స్పందించిన రెవెన్యూ ఉద్యోగుల సంఘం చైర్మన్ దివాకర్..

AP Elections: తమ అభ్యర్థనలను తోసిపుస్తూ స్థానిక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడంపై రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం..

AP Elections: మీవేనా ప్రాణాలు.. మావి కాదా?.. ఎన్నికల నోటిఫికేషన్‌పై తీవ్రంగా స్పందించిన రెవెన్యూ ఉద్యోగుల సంఘం చైర్మన్ దివాకర్..
Follow us

|

Updated on: Jan 23, 2021 | 1:55 PM

AP Elections: తమ అభ్యర్థనలను తోసిపుస్తూ స్థానిక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడంపై రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం చైర్మన్ దివాకర్ తీవ్రంగా స్పందించారు. ఎస్ఈసీ తీరును తప్పుపట్టారు. శనివారం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన దివాకర్.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించొద్దన్నారు. తమ ప్రాణాలకంటే ఎన్నికలేం ముఖ్యం కాదని వ్యాఖ్యానించారు.

ఉద్యోగ సంఘాల నాయకులుగా తమ ప్రాణాలు బలి ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నాం కానీ.. ఉద్యోగులను బలి చేయబోమని దివాకర్ స్పష్టం చేశారు. ఉద్యోగుల సంఘాల తరఫున సుప్రీంకోర్టుకు వెళతామన్నారు. 50 మంది విలేకరులు ఉన్న సమావేశంలో రమేష్ కుమార్ మొహానికి షీల్ట్ పెట్టుకుని మాట్లాడరని, మరి తమ ప్రాణాలంటే ఆయనకు లెక్క లేవా? అని ప్రశ్నించారు. సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులతో సమావేశం నిర్వహించి ఎన్నికల అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర రెవెన్యూ సంఘాల చైర్మన్ దివాకర్ తెలిపారు.

Also read:

Punjab CM Amareender Singh: చనిపోయిన రైతుల కుటుంబాల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగాలు… రూ.5ల‌క్ష‌ల ప‌రిహారం..

Chandini Cries in PC:ప్రమాదంలో మరణించిన డైరెక్టర్‌ని గుర్తు చేసుకుని స్టేజ్ పైనే ఏడ్చేసిన హీరో, హీరోయిన్లు