Andhra Pradesh: వణికిస్తున్న వింత వ్యాధి.. ఇప్పడి వరకు 12 మంది మృతి..!

Andhra Pradesh: కంకణాపల్లిలో సంకటాలకు కారణం ఏమిటి? ప్రాణాలకు బలి తీసుకుంటున్న అంతుచిక్కని వ్యాధి. ఏంటీ వ్యాధి ? దీని లక్షణాలు ఏంటి ? వివరాల్లోకెళితే..

Andhra Pradesh: వణికిస్తున్న వింత వ్యాధి.. ఇప్పడి వరకు 12 మంది మృతి..!
Mystery Disease
Follow us

|

Updated on: Apr 15, 2022 | 5:45 AM

Andhra Pradesh: కంకణాపల్లిలో సంకటాలకు కారణం ఏమిటి? ప్రాణాలకు బలి తీసుకుంటున్న అంతుచిక్కని వ్యాధి. ఏంటీ వ్యాధి ? దీని లక్షణాలు ఏంటి ? వివరాల్లోకెళితే.. పార్వతీపురం మన్యం జిల్లాలో అంతుచిక్కని వ్యాధి గిరిజనులను బలి తీసుకుంటోంది. ఆ వ్యాధి ఏంటి ? ఇక్కడే ఎందుకు మరణాలు సంభవిస్తున్నాయో తెలియక ఇక్కడి గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు 12 మంది ఈ వ్యాధితో మృతి చెందడంతో ఆదివాసీల్లో ఆందోళన మొదలైంది. అయితే పరిస్థితి ఇంత సీరియస్‌గా ఉన్నా, అధికారులు మాత్రం కనీసం వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేయలేదని గిరిజన నాయకులు ఆరోపిస్తున్నారు.

పాచిపెంట మండలం కంకణాపల్లిలో అంతుపట్టని వ్యాధితో ప్రస్తుతం ఐదుగురు గ్రామస్తులు అనారోగ్యం బారిన పడ్డారు. మొహం, కాళ్లు, చేతులు ఉబ్బిపోవడం రోజు రోజుకు నీరసం అవుతున్నారు. అంతేకాదు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో తక్కువ సమయంలో రోజుల వ్యవధిలోనే మృత్యువాత పడటం ఈ వ్యాధి లక్షణాలుగా చెబుతున్నారు గ్రామస్తులు.

గతేడాది కూడా ఇదే సమయంలో వింత వ్యాధితో 12 మంది వరకు గ్రామస్తులు మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పుడు తమ పరిస్థితి ఏంటా అని భయాందోళనకు గురవుతున్నారు. అసలు ఈ వ్యాధి ఏంటి? ఈ వ్యాధికి గల కారణాలు ఏంటి అనే అంశంపై కారణాలు సేకరిస్తున్నారు అధికారులు. అయితే గ్రామంలో ఇప్పటివరకు వైద్యాధికారులు మాత్రం వైద్య శిబిరం ఏర్పాటు చేయలేదు.. అస్వస్థతకు గురైన ఐదుగురిలో ఒకరి పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో విజయనగరం కేంద్రాసుపత్రికి తరలించారు. అటు మిగతా వారు చికిత్స పొందుతున్నారు. దీంతో ఈ వింత వ్యాధి ఏంటో తేల్చాలని, వ్యాధి బారిన పడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని గిరిజన నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

Also read:

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హెచ్‌బీఏ పై వడ్డీని భారీగా తగ్గించిన సర్కార్..

Viral Video: ఒరే బుడ్డొడా ఏంట్రా ఇదీ.. ఒక్క దెబ్బతో చదువంతా బుర్రకెక్కాలట.. వీడియో చూస్తే పడి పడి నవ్వుతారు..!

History Creator: ఒకే ఓవర్లో 6 వికెట్లు.. సరికొత్త చరిత్ర సృష్టించిన బౌలర్.. ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించాడు..