New Year 2023: అసలే కొత్త సంవత్సరం.. మందుబాబులు ఇది అస్సలు చూడొద్దు.. గుండెతరుక్కుపోవడం ఖాయం..!

న్యూఇయర్ వేళ మందుబాబులకు బిగ్ షాక్ ఇచ్చారు కృష్ణా జిల్లా పోలీసులు. జిల్లా వ్యాప్తంగా సీజ్ చేసిన అక్రమ మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు పోలీసులు. ఒకటి కాదు..

New Year 2023: అసలే కొత్త సంవత్సరం.. మందుబాబులు ఇది అస్సలు చూడొద్దు.. గుండెతరుక్కుపోవడం ఖాయం..!
Liquor
Follow us

|

Updated on: Dec 31, 2022 | 7:33 PM

న్యూఇయర్ వేళ మందుబాబులకు బిగ్ షాక్ ఇచ్చారు కృష్ణా జిల్లా పోలీసులు. జిల్లా వ్యాప్తంగా సీజ్ చేసిన అక్రమ మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు పోలీసులు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. 50 లక్షల విలువైన మద్యం సీసాలను రోడ్ రోలర్‌తో తొక్కించేశారు. దాంతో రోడ్డుపై మద్యం ఏరులైపారింది. ఎస్పీ జాషువా ఆధ్వర్యంలో మద్యం బాటిళ్లను పోలీసులు ధ్వంసం చేశారు. రాష్ట్రంలో మద్యం ధరలు అధికంగా ఉండటంతో.. ప్రజలు తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. దాంతో సరిహద్దుల వద్ద పోలీసులు గట్టి నిఘా పెట్టి.. మద్యం అక్రమ రవాణా చేస్తున్న వారిని పట్టుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇటీవలి కాలంలో మొత్తం రూ. 50 లక్షల విలువైన మద్యాన్ని పట్టుకున్నారు. అలాగే, మద్యం అక్రమ రవాణాకు ఉపయోగించిన 119 వాహనాలను సీజ్ చేశారు. ఈ వాహనాలను రెండు దఫాలుగా వేలం వేయగా.. రూ. 41 లక్షలు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక పట్టుబడిన మద్యాన్ని శనివారం నాడు ఎస్పీ జాషువా ఆధ్వర్యంలో రోడ్డుపై పరిచి రోడ్ రోలర్‌తో తొక్కించేశారు.

కాగా, మద్యం బాటిళ్ల ధ్వంసం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక మందుబాబులు అయితే, తమదైన స్టైల్లో రియాక్ట్ అవుతున్నారు. ‘అయ్యో అయ్యో అయ్యయ్యో’ అంటూ బాధతో ఎమోజీలు పెడుతున్నారు. అసలే న్యూఇయర్ వేళ.. ఇంత పెద్ద మొత్తంలో మద్యం సీసాలు ధ్వంసం చేయడం చూస్తే మందుబాబుల గుండె తరుక్కుపోవడం ఖాయం అని, మందు బాబులు ఈ వీడియోలను, దృశ్యాలను అస్సలు చూడొద్దని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి
Liquor

Liquor

Liquor

Liquor

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?