AP Municipal Elections: పంచాయతీ ఎన్నికల ఎఫెక్ట్.. కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్న టీడీపీ నేతలు.. ఏపీలో అసలేం జరుగుతోంది..?

AP Municipal Elections: పంచాయతీ ఎన్నికలు ఫలితాలతో షాక్ తిన్న టీడీపీ మున్సిపల్ ఎన్నికల్లో పట్టు నిలువుకోవాలని సర్వ శక్తులు ఒడ్డుతోంది.

AP Municipal Elections: పంచాయతీ ఎన్నికల ఎఫెక్ట్.. కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్న టీడీపీ నేతలు.. ఏపీలో అసలేం జరుగుతోంది..?
Follow us

|

Updated on: Mar 06, 2021 | 12:54 AM

AP Municipal Elections: పంచాయతీ ఎన్నికలు ఫలితాలతో షాక్ తిన్న టీడీపీ మున్సిపల్ ఎన్నికల్లో పట్టు నిలువుకోవాలని సర్వ శక్తులు ఒడ్డుతోంది. ఈ ఎన్నికలకు 10 వాగ్దానాలతో మేనిఫెస్టో ప్రకటించి ప్రజల్లోకి వెళుతోంది. టీడీపీ ముఖ్య నేతలైన చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ ,అచ్చెన్నాయుడు ప్రచారం పర్వం లోకి దిగి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని, గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంది టీడీపీ.

నాలుగు దశల్లో జరిగిన పంచాయతీ ఫలితాలు టీడీపీకి షాక్ ఇచ్చాయి. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగింది. పార్టీ రహితంగా జరిగిన ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ సత్తా చాటింది. పార్టీ గుర్తులతో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలపై ప్రధాన పార్టీలు గురి పెట్టాయి. కొన్నిచోట్ల పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. అ నేపథ్యలోనే మున్సిపల్ ఎన్నికలను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 10 వాగ్దానాలతో మేనిఫెస్టోను ప్రకటించింది.

మరోవైపు ప్రచార పర్వంలోకి టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు దిగారు. కర్నూలు జిల్లా నుంచి వరుసగా విశాఖ, గుంటూరు, విజయవాడలో చంద్రబాబు రోడ్ షో లతో ప్రచారం నిర్వహిస్తున్నారు. లోకేశ్ విశాఖ నుంచి ప్రచారం ప్రారంభించారు. వివిధ వర్గాలతో మమేకం అవుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒంగోలులో మిగిలిన జిల్లాల్లో ప్రచారం నిర్వహించబోతున్నారు లోకేశ్. బాలకృష్ణ అనంతపురం జిల్లాలో తమ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. అచ్చెన్నాయుడుతో సహా ముఖ్య నేతలు వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ.. అభ్యర్థులను సమన్వయం చేసుకుంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలసి వస్తుందని..22 నెలల పాలనలో అభివృద్ధి ఏమి చేయలేదని టీడీపీ విమర్శలు చేస్తోంది.

మేనిఫెస్టో‌లో 10 వాగ్దానాలతో ప్రజల్లోకి వెళుతోంది టీడీపీ. అన్న క్యాంటీన్లు తెరిపిస్తామని, వడ్డీలేని రుణాలు, ఉచిత నీటి కనెక్షన్ సున్నా నీటి పన్నుతో, ఆరు నెలలకు ఒకసారి ఉద్యోగ మేళా, పట్టణ పేదలకు గృహ నిర్మాణం, పాత పన్ను మాఫీ, పారిశుద్ధ్య కార్మికులకు రూ. 21 వేల వేతనం.. వంటి హామీలతో టీడీపీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, మూడు రాజధానులు అంశం ఈ ఎన్నికల్లో ప్రధాన అంశంగా ప్రభావితం చేస్తున్నది. మెజార్టీ స్థానాలు గెలుస్తామని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది.

మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ తన హవాను కొనసాగించడంతో.. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. మరి మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ హవా కొనసాగుతుందో తెలియాలంటే.. మార్చి 14వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

Also read:

AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్.. జగన్ అరెస్ట్.. తీవ్రంగా ఖండించిన టీడీపీ నేతలు..!

India vs England 4th Test: భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్.. హిట్ మ్యాన్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్..!

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..