Andhra Pradesh: ఒక్క ప్రెస్‌మీట్.. ముగ్గురికి స్ట్రాంగ్ కౌంటర్.. తగ్గేదేలే అంటున్న మంత్రి రోజా..

ఏపీ రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా పేరొందిన మంత్రి రోజా.. మరోసారి తనదైన శైలిలో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. ఒకే ప్రెస్‌మీట్‌లో ముగ్గురు టాప్ లీడర్లపై షాకింగ్ కామెంట్స్ చేశారు. టీడీపీ నాయకుడు నారా లోకేష్,

Andhra Pradesh: ఒక్క ప్రెస్‌మీట్.. ముగ్గురికి స్ట్రాంగ్ కౌంటర్.. తగ్గేదేలే అంటున్న మంత్రి రోజా..
Minister Roja
Follow us

|

Updated on: Jan 25, 2023 | 4:59 PM

ఏపీ రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా పేరొందిన మంత్రి రోజా.. మరోసారి తనదైన శైలిలో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. ఒకే ప్రెస్‌మీట్‌లో ముగ్గురు టాప్ లీడర్లపై షాకింగ్ కామెంట్స్ చేశారు. టీడీపీ నాయకుడు నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఎమ్మెల్యే బాలకృష్ణపై విమర్శలు గుప్పించారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన మంత్రి రోజా.. లోకేష్‌ పాదయాత్రకు ఆంక్షలపై టీడీపీ చేస్తున్న విమర్శలపై తీవ్రంగా స్పందించారు. లోకేష్‌ని చూసి తాము భయపడటం ఏంటన్నారు. సీఎం జగన్‌తో లోకేష్‌కు పోలికే పెద్ద జోక్ అని వ్యాఖ్యానించారు. లోకేష్ పాదయాత్ర చేసినా ఉపయోగం ఉండదన్నారు.

కన్‌ఫ్యూజ్ పార్టీ అని పెట్టుకుంటే బెటర్..

జనసేన పేరు మార్చి కన్ఫ్యూజన్‌ పార్టీ అని పెట్టుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు మంత్రి రోజా. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో పవన్‌కే తెలియదన్నారు. బీజేపీ రూట్ మ్యాప్‌ని పక్కన పడేశారని అన్నారు. సీఎం కాలేనని పవన్‌కి కూడా అర్థమైపోయింది కాబట్టే, చంద్రసేనకి సైనికుడిగా ఉండేందుకు తాపత్రయ పడుతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పోటీ చేస్తే పవన్‌కు అర్థమవుతుందని, వాళ్లిచ్చే రిటర్న్‌ గిఫ్ట్‌ ఎలా ఉంటుందో తెలుస్తుందన్నారు మంత్రి రోజా.

బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందన..

అక్కినేనిపై బాలకృష్ణ వ్యాఖ్యలను తప్పుపట్టారు రోజా. బాలకృష్ణ ఎన్టీఆర్‌ కొడుకై ఉండి అలాంటి కామెంట్స్‌ చేయడం తగదని హితవు పలికారు. నాగేశ్వర్‌ రావు గారు ఎన్టీఆర్‌కి సమానమైన హీరో అని.. ఎంతమాట పడితే అంత మాట సరికాదని అన్నారు. దాని పరిణామాలు అర్థంకాకే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని.. దాన్ని అభిమానులు ఆలోచించాలన్నారు. అదే ఎన్టీఆర్‌పై ఎవరైనా కామెంట్‌ చేస్తే ఎలా ఉంటుంది? అని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..