Andhra Pradesh: తెలిసినవాడే కదా అని నమ్మారు.. అసలు విషయం తెలిసి లబోదిబోమంటున్నారు..

Andhra Pradesh: తెలిసినవాడే కదా అని నమ్మారు. అసలు విషయం తెలిసి లబోదిబోమంటున్నారు. విజయనగరం జిల్లాలో..

Andhra Pradesh: తెలిసినవాడే కదా అని నమ్మారు.. అసలు విషయం తెలిసి లబోదిబోమంటున్నారు..
Follow us

|

Updated on: Feb 16, 2022 | 7:31 AM

Andhra Pradesh: తెలిసినవాడే కదా అని నమ్మారు. అసలు విషయం తెలిసి లబోదిబోమంటున్నారు. విజయనగరం జిల్లాలో జరిగిన ఘరానా మోసం ఇప్పుడు కలకలం రేపుతోంది. విజయనగరం జిల్లా సాలూరు కెనరా బ్యాంక్‌లో ఘరానా మోసం జరిగింది. ఇందులో గోల్డ్ ఎప్రయిజర్‌గా పనిచేస్తున్న బాబ్జి, ఖాతాదారులను నిండా ముంచాడు. బంగారం తాకట్టుకు బ్యాంక్‌కు వచ్చిన కష్టమర్లను తన తెలివితేటలతో బోల్తా కొట్టించాడు. బ్యాంక్‌కు వచ్చిన బంగారాన్ని ప్రవేట్ ఫైనాన్స్‌లో తనఖా పెట్టేవాడు. అక్కడ ఎక్కువ మొత్తంలో డబ్బులు తెచ్చి, తక్కువ నగదు బ్యాంక్ కష్టమర్లకి ఇచ్చేవాడు. అంతే కాకుండా, బ్యాంక్‌లో బంగారం పెట్టినట్టు రశీదు కూడా ఇస్తుండటంతో కష్టమర్లకు అనుమానం రాలేదు. తిరిగి తమ బంగారం బ్యాంక్ నుంచి విడిపించేందుకు ప్రయత్నిస్తుంటే, ఏదో ఒక కారణం చెబుతూ బంగారం ఇవ్వకుండా ఖాతాదారులను వెనక్కి పంపిస్తున్నాడు. ఎన్నిసార్లు తిరిగినా బంగారం ఇవ్వకపోయే సరికి అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు బాధితులు. ఇప్పటికే, లక్షల రూపాయలు మోసానికి పాల్పడ్డట్టు అనుమానిస్తున్నారు. కాగా, ఈ ఘరానా మోసంలో మరికొందరు బ్యాంక్ ఉద్యోగుల పాత్రపైనా ఆరా తీస్తున్నారు పోలీసులు. అటు తమ బంగారాన్ని ఇప్పించాలని కోరుతున్నారు బాధితులు.

Also read:

IND vs WI 1st T20I: నేటినుంచే భారత్ వర్సెస్ వెస్టిండీస్ టీ20 సిరీస్.. తొలి మ్యాచ్‌ను ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

Kcr vs Central Govt: తెలంగాణలో హీటెక్కిన కరెంటు మీటర్ల రాజకీయం.. సీఎం కేసీఆర్‌కు కేంద్రం కౌంటర్‌

Water: తిన్న వెంటనే మంచి నీళ్లు తాగొచ్చా.. అసలు మంచి నీళ్లు ఎలా, ఎప్పుడు తాగాలో తెలుసా..