Andhra Pradesh: మహిళలను అడ్డం పెట్టి టీడీపీ శాడిస్టు సైకాలజీ ప్రదర్శిస్తోంది.. గోరంట్ల మాధవ్ వీడియోపై హోం మంత్రి కామెంట్స్

టీడీపీ తీరుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత (Taneti Vanitha) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహిళలను అడ్డం పెట్టుకుని శాడిస్టు సైకాలజీని ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) వ్యవహారంలో తప్పు...

Andhra Pradesh: మహిళలను అడ్డం పెట్టి టీడీపీ శాడిస్టు సైకాలజీ ప్రదర్శిస్తోంది.. గోరంట్ల మాధవ్ వీడియోపై హోం మంత్రి కామెంట్స్
Taneti Vanitha
Follow us

|

Updated on: Aug 09, 2022 | 7:10 PM

టీడీపీ తీరుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత (Taneti Vanitha) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహిళలను అడ్డం పెట్టుకుని శాడిస్టు సైకాలజీని ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) వ్యవహారంలో తప్పు చేసినట్టు నిరూపణ అయితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన ఆ వీడియో అసలో, కాదో అన్నదానిపై ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామని, ఆ నివేదిక వచ్చిన తర్వాత వాస్తవాలు వెలుగుచూస్తాయన్నారు. తప్పు ఎవరు చేసినా, తన మన అనే తారతమ్యం లేకుండా తప్పును తప్పుగానే చూస్తామని చెప్పారు. ఒకవేళ ప్రభుత్వంపై బురదచల్లేందుకు రాజకీయ కుట్ర కోణంలో భాగంగా ఇటువంటి చర్యకు ఎవరైనా పాల్పడినట్టు తేలితే వారిపై కూడా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వీడియో వ్యవహారంలో బాధిత మహిళలు ఎవరూ ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని, మహిళలపై అరాచకాలు జరుగుతున్నాయంటూ టీడీపీ (TDP) మహిళా నేతలు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం హాస్యాస్పదంగా ఉందని ధ్వజమెత్తారు. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని ప్రభుత్వం మీద బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై అనవసరంగా నోరు పారేసుకుంటున్న మహిళలు వాడుతున్న భాష మహిళా సమాజం తలదించుకునేలా ఉందని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో మహిళలకు ఏ ఇబ్బంది రాకుండా సీఎం జగన్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. మహిళల భద్రత, అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలు చూసి ఓర్వలేక టీడీపీ ఉద్దేశపూర్వకంగా ఇలాంటి పనులు చేయిస్తోంది. ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు జుగుప్సాకరమైన రాజకీయాలకు తెర లేపింది. వీడియోపై సంబంధిత ఎంపీనే అది మార్ఫింగ్ వీడియో అని కంప్లైంట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాం. నిజమని తేలితే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. మహిళలకు న్యాయం చేయటానికి, మహిళల గౌరవం కాపాడటానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ ముందు ఉంటారు. మహిళకు ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉందనేది గత మూడేళ్లుగా జగన్ పాలనను చూస్తే అర్థమవుతుంది. మహిళల భద్రత కోసం దిశ చట్టానికి రూపకల్పన చేశాం. దిశ యాప్ ను తెచ్చి, ప్రత్యేక పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేశాం. కాల్ చేసిన క్షణాల్లోనే వారికి భద్రత కల్పిస్తున్నాం. రాష్ట్రంలోని మహిళలందరూ తమ సొంత అన్న, తమ్ముడు, తనయుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, తమకు భద్రత, భరోసా కల్పిస్తున్నారని భావించే పరిస్థితి ఉంది.

– తానేటి వనిత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి

ఇవి కూడా చదవండి

గోరంట్ల మాధవ్ తమ పార్టీకి చెందిన ఎంపీ అయినప్పటికీ.. తప్పు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఈ విషయాన్ని ప్రభుత్వపరంగా, పార్టీ పరంగా స్పష్టం చేసినప్పటికీ టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వీడియోలను ఎంకరేజ్ చేసే పరిస్థితి సమాజంగానీ, ప్రభుత్వం గానీ లేదు. ఒకవేళ ఇదేదో రాజకీయ కుట్రలో భాగంగా, ప్రభుత్వం మీద బురదజల్లే విధంగా ఎంపీని వాడుకున్నట్లు నిరూపణ అయినా, వాళ్లను కూడా ఉపేక్షించేది లేదని వెల్లడించారు. రాష్ట్రంలో మహిళలకు ఏ ఇబ్బందీ లేదన్న హోం మంత్రి.. మహిళలు ధైర్యంగా ఉండొచ్చని హితవు పలికారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయాలి..