ఏపీలో ఇవాళ రాత్రి నుంచే ఆర్టీసీ స‌ర్వీసులు..ఈ ప్రాంతాల‌లోనే…

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా రెండు నెలలగా ఆగిపోయిన ఆర్టీసీ బస్సుల స‌ర్వీసుల‌ను ఏపీలో ఇవాళ పునఃప్రారంభించ‌నున్నారు. నేటి రాత్రికి దూర ప్రాంతాలకు వెళ్లే కొన్ని బ‌స్సుల‌ను స్టార్ట్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. బస్సుల పునరుద్దరణపై ముఖ్య‌మంత్రి జగన్ నిర్ణయం తీసుకున్న 24 గంటల్లోనే స‌ర్వీసులు స్టార్ట్ చేస్తామ‌ని సోమ‌వారం రవాణామంత్రి పేర్నినాని ప్రకటించిన నేపథ్యంలో… మంగ‌ళ‌వారం రాత్రి నుంచి కొన్ని సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇక బస్సులు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి […]

  • Ram Naramaneni
  • Publish Date - 12:59 pm, Tue, 19 May 20
ఏపీలో ఇవాళ రాత్రి నుంచే ఆర్టీసీ స‌ర్వీసులు..ఈ ప్రాంతాల‌లోనే...

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా రెండు నెలలగా ఆగిపోయిన ఆర్టీసీ బస్సుల స‌ర్వీసుల‌ను ఏపీలో ఇవాళ పునఃప్రారంభించ‌నున్నారు. నేటి రాత్రికి దూర ప్రాంతాలకు వెళ్లే కొన్ని బ‌స్సుల‌ను స్టార్ట్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. బస్సుల పునరుద్దరణపై ముఖ్య‌మంత్రి జగన్ నిర్ణయం తీసుకున్న 24 గంటల్లోనే స‌ర్వీసులు స్టార్ట్ చేస్తామ‌ని సోమ‌వారం రవాణామంత్రి పేర్నినాని ప్రకటించిన నేపథ్యంలో… మంగ‌ళ‌వారం రాత్రి నుంచి కొన్ని సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

ఇక బస్సులు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి నడపాలనే విషయంలో ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్ర‌ణాళిక సిద్దం చేశారు. ఈ క్ర‌మంలో రాష్ట్రంలోని మెయిన్ సిటీస్ మధ్య సర్వీసులను మొద‌ట పునరుద్ధరించనున్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతితో పాటు ప్రధాన నగరాలను కలిపే సర్వీసులకు తొలుత ప్రాధాన్యం ఇవ్వ‌నున్నారు. అదే విధంగా ప్రతీ జిల్లా హెడ్ క్వార్ట‌ర్స్ ని మరో జిల్లా కేంద్రంతో అనుసంధానం జ‌రిగేలా సర్వీసుల పునరుద్ధరణ ఉండబోతోంది. ప్రస్తుతం దాదాపుగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కోవిడ్-19 కేసులు ఉన్నాయి. అయితే ఆయా ప్రాంతాలు అన్నీ కూడా పూర్తిగా రెడ్ జోన్లలో లేవు. దీంతో జిల్లా కేంద్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసుల పునరుద్ధరణకు ఛాన్స‌స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.