Andhra Pradesh: సినిమా టిక్కెట్ల విక్రయాలపై ఏపీ సర్కార్ గైడ్ లైన్స్.. ప్రతి టిక్కెట్ పై సర్వీస్ ఛార్జ్

సినిమా టిక్కె్ట్ల అమ్మకాలపై ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆన్ లైన్ లో టిక్కెట్ల(Online Cinema Tickets) విక్రయాలపై గైడ్ లైన్స్ జారీ చేసింది. ఇందుకు గానూ నోడల్ ఏజెన్సీగా ఏపీఎఫ్డీసీ కి సర్వీస్....

Andhra Pradesh: సినిమా టిక్కెట్ల విక్రయాలపై ఏపీ సర్కార్ గైడ్ లైన్స్.. ప్రతి టిక్కెట్ పై సర్వీస్ ఛార్జ్
Movie Tickets
Follow us

|

Updated on: Jun 03, 2022 | 8:24 AM

సినిమా టిక్కె్ట్ల అమ్మకాలపై ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆన్ లైన్ లో టిక్కెట్ల(Online Cinema Tickets) విక్రయాలపై గైడ్ లైన్స్ జారీ చేసింది. ఇందుకు గానూ నోడల్ ఏజెన్సీగా ఏపీఎఫ్డీసీ కి సర్వీస్ ప్రొవైడర్ నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. అన్ని థియేటర్లు, ప్రైవేట్ సంస్థలు నోడల్ ఏజెన్సీ సర్వీస్ ప్రొవైడర్ గేట్ వే ద్వారానే అమ్మకాలు చేపట్టాలని మార్గదర్శకాల్లో వెల్లడించింది. ప్రతి టికెట్ పై రెండు శాతం సర్వీస్ ఛార్జ్ వసూలు చేయనున్నారు. థియేటర్లలో పక్కాగా ఆన్ లైన్ టికెట్ అమ్మకాలు చేపట్టాలని సూచించింది. ఇందు కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ థియేటర్లు ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. కొత్త సినిమాకు వారం ముందు నుంచి మాత్రమే టిక్కెట్లు అమ్మాలని స్పష్టం చేసింది. నెల రోజుల్లోగా అన్ని థియేటర్లలో ఆన్ లైన్ విధానాన్ని అమలు చేయాలని, నిబంధనలు పాటించని థియేటర్ల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించింది.

ప్రభుత్వం నిర్ణయించిన ధరలు మాత్రమే అమలయ్యేలా ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థను తీసుకొస్తామని మాజీ మంత్రి పేర్నినాని గతంలో ప్రకటించారు. సినీ ప్రముఖలతో సమావేశం అనంతరం ఆయన వివరించారు. ప్రజలకు మేలు చేసేలా ఎవరు ఏ విన్నపం చేసినా జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్ సానుకూలంగా స్పందిస్తుందని అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల గురించి తాజా సమావేశంలో వారికి వివరించామని అన్నారు. ప్రజలెవరూ ప్రశ్నించే అవకాశం లేకుండా పారదర్శకతతో కూడిన రేట్లను అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ నిర్దేశించిన ధరలను మాత్రమే థియేటర్‌లో అమలు చేయాలని, అందుకు ఆన్‌లైన్‌ వ్యవస్థ ద్వారా వినోదాన్ని అందించేందుకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి