AP CM YS Jagan: కేబినెట్ భేటీలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన.. ‘మిషన్ 2024’ కసరత్తు షురూ!

Mission-2024 Elections: ఎన్నికలకు ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి. ఇవాళ జరిగిన కేబినెట్‌ సమావేశంలో సహచర మంత్రులతో దీనిపై చర్చించినట్లు తెలుస్తోంది.

AP CM YS Jagan: కేబినెట్ భేటీలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన.. ‘మిషన్ 2024’ కసరత్తు షురూ!
Ys Jagan And Prasant Kishor
Follow us

|

Updated on: Sep 16, 2021 | 8:09 PM

AP CM YS Jagan on Assembly Election-2024: 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి. ఇవాళ జరిగిన కేబినెట్‌ సమావేశంలో సహచర మంత్రులతో దీనిపై చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది పార్టీ కోసం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పీకే టీమ్‌ మళ్లీ వస్తుందని మంత్రులకు జగన్‌ చెప్పినట్లు సమాచారం. ఈలోగా క్షేత్ర స్థాయిలో ఎన్నికలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రులను సీఎం జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఇవాళ జరిగిన మంత్రివర్గ భేటీలో సీఎం జగన్ తన మిషన్ 2024 అని తేల్చి చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైసీపీ పార్టీ.. ఇప్పటికే రెండున్నారేళ్ల అధికారం పూర్తి చేసుకున్నారు జగన్. ఇక, తిరిగి 2024 ఎన్నికల్లో అధికారం దక్కించుకోవటంపైన ఇప్పటి నుంచే ఫోకస్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు అమరావతి సచివాలయం కార్యాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ కీలక సూచనలు చేశారు. ప్రతిపక్షాలు ప్రభుత్వ పధకాలపైన చేస్తున్న విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని సీఎం జగన్ మంత్రులకు సూచించారు.

అదేవిధంగా పార్టీ నేతలతో మంత్రులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ క్రమంలోనే మంత్రులు జిల్లాలోని ఎమ్మెల్యేలను..ఎమ్మెల్సీలను కలుపుకొని ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఇక, అధికారంలో వచ్చి త్వరలో మూడేళ్లు పూర్తి అవుతున్నందున త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం.. అందులో దాదాపుగా 85 నుంచి 90 శాతం మార్పులు ఉంటాయని సీఎం తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుత కేబినెట్‌లో ఉన్న మంత్రులను మార్చి వారికి పూర్తిగా పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశముంది. ముఖ్యంగా మిషన్ 2024 లక్ష్యంతో పనిచేసేలా సీఎం జగన్ ముందుస్తు ప్రణాళికలు రచిస్తున్నారు.

సీఎం జగన్ ఏది చేసినా ముందుగా చెప్పి చేయటం అలవాటు. తొలి కేబినెట్ ఏర్పాటు సమయంలోనే తాను రెండున్నారేళ్ల తరువాత కేబినెట్ విస్తరణ ఉంటుందని.. 90 శాతం మంది మంత్రులను మార్చాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పుడు తిరిగి అవే సంకేతాలు ఇచ్చారు. మంత్రి పదవులు కోల్పోయిన వారికి పార్టీ కోసం పని చేయటం ద్వారా మరింత కీలకమైన బాధ్యతలు అప్పగిస్తున్నామనే విషయాన్ని గుర్తించాలని సీఎం వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. మరో కీలక అంశాన్ని సీఎం ప్రస్తావించారు.

2019 ఎన్నికలకు దాదాపుగా ఏడాదిన్నార ముందుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం మరోసారి తమతో కలిసి పనిచేయనున్నట్లు చెప్పినట్లు సమాచారం. వచ్చే ఏడాది మే నుంచి ప్రశాంత్ కిషోర్ టీం ఏపీకి వస్తుందని..వైసీపికి పని చేయనుందని జగన్ తన కేబినెట్ మంత్రులకు వివరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకూ ఆ టీం పార్టీ కోసం పని చేస్తుందని జగన్ క్లారిటీ ఇచ్చేశారు. ఇదిలావుంటే, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత తాను ఇక ఎన్నికల వ్యూహకర్తగా పని చేయనంటూ ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ఓ దశలో ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పటికీ కొన్ని పార్టీలకు ప్రశాంత్ కిషోర్ నాయకత్వం వహించిన పీకే టీం సభ్యులు పొలిటికల్ స్ట్రాటజిస్టులుగా పని చేస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ లో జగన్ సోదరి షర్మిల పార్టీకి సైతం పీకే టీం సభ్యులే పని చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు పీకే టీం తిరిగి వైసీపీ కోసం పని చేసేందుకు రానుందని స్వయంగా సీఎం నోటి నుంచి వచ్చిన మాట కావటంతో..దీనిని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశంగా పార్టీ నేతలు చెబుతున్నారు.

బయట ప్రతిపక్షాలు ..ఇతరులు ప్రచారం చేస్తున్నట్లుగా ప్రభుత్వం పైన వ్యతిరేకత లేదని … ప్రజల్లో ఉన్న సానుకూలత మరింత అనుకూలంగా మలచుకొనే వ్యూహాలు అమలు చేయాలని జగన్ నిర్దేశించారు. అందు కోసం ప్రతీ మంత్రి..ఎమ్మెల్యే ప్రతీ ఇంటికి పార్టీ ప్రభుత్వ పధకాల గురించి వివరిస్తూ గడప గడపకు వైసీపీ కార్యక్రమం నిర్వహించాలని సూచించినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటుగా అక్టోబర్ రెండో తేదీ నుంచి తాను ప్రభుత్వ పధకాల సమీక్షల్లో భాగంగా రచ్చబండలో పాల్గొంటానని గతంలోనే సీఎం వెల్లడించారు. దీంతో..వైసీపీ ముందస్తుగానే 2024 ఎన్నికల కోసం రంగంలోకి దిగుతున్నట్లుగా కనిపిస్తోంది. సీఎం మాత్రం అధికారంలో ఉన్నా..వచ్చే ఎన్నికల పైన అప్పుడే మంత్రులకు దిశా నిర్దేశం చేయటం…సీనియర్లను తొలిగించక తప్పదనే సంకేతాలు ఇవ్వటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో. .ప్రత్యేకించి వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. సీఎం వ్యాఖ్యలు ప్రతిపక్షాల్లోనూ కలవరం మొదలైంది.

Read Also…  Terror attack plans: దేశవ్యాప్తంగా భారీ కుట్రకు ఉగ్ర ముఠా ప్లాన్.. దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..