Andhra Pradesh: నూతన విద్యా విధానం అమలుపై అధికారులతో సీఎం సమీక్ష.. కీలక సూచనలు చేసిన సీఎం జగన్..

Andhra Pradesh: విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, నూతన విద్యా విధానం అమలుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ సమీక్ష నిర్వహించారు.

Andhra Pradesh: నూతన విద్యా విధానం అమలుపై అధికారులతో సీఎం సమీక్ష.. కీలక సూచనలు చేసిన సీఎం జగన్..
Jagan
Follow us

|

Updated on: Nov 17, 2021 | 9:49 PM

Andhra Pradesh: విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, నూతన విద్యా విధానం అమలుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షకు సంబధిత శాఖ అధికారులు హాజరయ్యారు. శాటిలైట్‌ ఫౌండేషనల్‌ స్కూల్స్, ఫౌండేషనల్‌ స్కూల్స్, ఫౌండేషనల్‌ ప్లస్‌ స్కూల్స్, ప్రీ హైస్కూల్స్, హైస్కూల్స్, హైస్కూల్‌ ప్లస్‌ స్కూల్స్‌పై సీఎంకు వివరాలు అందజేశారు అధికారులు. నూతన విద్యా విధానంలో తీసుకున్న చర్యలు, వాటి అమలుపై సీఎం ఆరా తీశారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను నియమించడంతో పాటు, సబ్జెక్టుల వారీగా టీచర్లు, వారితో బోధనే లక్ష్యంగా నూతన విద్యా విధానం అమలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

2021-2022 నుంచి 2022–23, 2023–24 వరకూ మూడు విద్యా సంవత్సరాల్లో మూడుదశలుగా పూర్తిగా నూతన విద్యా విధానం అమలు చేయాలని అన్నారు. దీనిలో భాగంగా 25,396 ప్రైమరీ పాఠశాలలను అప్పర్ ప్రైమరీ స్కూళ్లు, హైస్కూళ్లలో విలీనం చేయనున్నారు. తొలిదశలో భాగంగా ఈ విద్యా సంవత్సరం 2,663 స్కూళ్లు విలీనం చేశామని సీఎంకు అధికారులు తెలిపారు. 2,05,071 మంది విద్యార్థులు నూతన విద్యా విధానం అనుసరించి విలీనం అయ్యారని అధికారులు తెలిపారు. మొత్తంగా ఈ ప్రక్రియలో 9.5 లక్షల మంది విద్యార్థులకు నూతన విద్యావిధానం ఈ సంవత్సరమే అందుబాటులోకి వచ్చిందన్నారు. అంతర్జాతీయంగా 24వేల స్కూళ్లకు మాత్రమే సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ ఉందని అధికారులు పేర్కొన్నారు. ఒక దేశంలో ఒక ఏడాది, అదికూడా ఒక రాష్ట్రంలో 1,092 స్కూళ్లకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ ఇవ్వడం రికార్డ్ అని అధికారులు చెప్పారు.

కాగా, టీచర్‌ ట్రైనింగ్‌ ఇస్తున్న డైట్‌ సంస్థల సమర్థతను పెంచాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. టీచర్లకు అత్యంత నాణ్యమైన శిక్షణ అందాలని సూచించారు. టీచర్లకు శిక్షణకార్యక్రమాలపై వచ్చే సమావేశంలో వివరాలు అందించాలని ఆదేశించారు. స్కూళ్లలో సదుపాయాలకు సంబంధించి ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే వెంటనే కాల్‌ చేసేలా ఒక నెంబర్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి స్కూల్‌లో అందరికీ కనిపించేలా ఈ నంబర్‌ను ప్రదర్శించాలన్నారు. ఈ కాల్‌సెంటర్‌ను అధికారులు పర్యవేక్షించి.. వారినుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా ఇంగ్లీష్‌ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఇంగ్లీష్ ఉచ్ఛారణ, భాష, వ్యాకరణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.

Also read:

Viral Video: వధూవరుల కాస్ట్‌లీ వెడ్డింగ్‌ ఫొటోషూట్‌.. ఫన్నీగా స్పందిస్తోన్న నెటిజన్లు..

Major Movie: అడివి శేష్ మేజర్ మ్యూజిక్ రైట్స్ వారికే.. రిలీజ్ ఎప్పుడంటే..

Kulbhushan Jadhav: కుల్‌భూషణ్‌ జాదవ్‌కు స్వల్ప ఊరట.. పాక్‌‌ను ఆదేశించిన ఇంటర్నేషనల్‌ కోర్టు