Andhra Pradesh: సీఎం జగన్ కీలక నిర్ణయం.. ప్రతి తరగతి గదిలో డిజిటల్ టీచింగ్ కు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు అత్యున్నత పరిజ్ఞానాన్ని అందించేందుకు ప్రతి తరగతి గదిలో డిజిటల్‌ విద్యా బోధన చేపట్టాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ...

Andhra Pradesh: సీఎం జగన్ కీలక నిర్ణయం.. ప్రతి తరగతి గదిలో డిజిటల్ టీచింగ్ కు గ్రీన్ సిగ్నల్
Cm Ys Jagan
Follow us

|

Updated on: Jul 23, 2022 | 12:07 PM

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు అత్యున్నత పరిజ్ఞానాన్ని అందించేందుకు ప్రతి తరగతి గదిలో డిజిటల్‌ విద్యా బోధన చేపట్టాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన పరికరాలు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ (CM Jagan) వెల్లడించారు. విద్యార్థులకు సబ్జెక్టులు మరింత నిశితంగా అర్థం అయ్యేలా బోధించేందుకు డిజిటల్ విధానాన్ని తీసుకువస్తున్నామని తెలిపారు. నాణ్యమైన డిజిటల్‌ పరికరాల ఏర్పాటుకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్మార్ట్‌ బోధన సదుపాయాల వల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మేలు జరుగుతుందని వివరించారు. ఈ విద్యా సంవత్సరంలో సెప్టెంబర్‌లో 8వ తరగతి విద్యార్థులకు అందించే ట్యాబ్‌లు నాణ్యంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బైజూస్‌ కంటెంట్‌ ద్వారా విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులోకి వస్తుందని సీఎం స్పష్టం చేశారు.

రెండో దశ నాడు – నేడు పనులు వేగవంతం చేయాలి. స్కూళ్లలో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. టాయిలెట్స్‌ మెయింటెనెన్స్‌ ఫండ్‌ (టీఎంఎఫ్‌), స్కూల్‌ మెయింటెనెన్స్‌ ఫండ్‌ (ఎస్‌ఎంఎఫ్‌)లను సమర్థవంతంగా వినియోగించుకుని స్కూళ్ల నిర్వహణను పటిష్టం చేయాలి. విద్యా రంగంలో అనేక సంస్కరణల ద్వారా.. ప్రతి స్థాయిలో పర్యవేక్షణ దృఢంగా ఉండాలి. ఎస్‌సీఈఆర్టీ, డైట్‌ సీనియర్‌ లెక్చరర్స్, డైట్‌ లెక్చరర్స్‌ పోస్టుల భర్తీపైనా దృష్టి పెట్టాలి.

         – వైఎస్.జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

రాష్ట్రంలో ప్రవేశ పెడుతున్న పూర్వ ప్రాథమిక విద్యా తరగతుల నుంచే డిజిటల్‌ బోధనపై అధికారులు ఆలోచించాలని సీఎం జగన్ సూచించారు. పీపీ–1 (ప్రీ ప్రైమరీ–1) నుంచి రెండో తరగతి వరకు స్మార్ట్‌ టీవీలు, 3వ తరగతి ఆపైన తరగతులకు ప్రొజెక్టర్‌లు పెట్టేలా ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి