Monkeypox: ఆ బాలుడికి మంకీపాక్స్‌ నెగెటివ్‌ నిర్ధారణ.. ఊపిరి పీల్చుకున్న అధికారులు..!

Monkeypox: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మమహ్మారి ఎంతో భయాందోళనకు గురి చేసింది. కరోనా కట్టడికి దేశాలు శత విధాలుగా ప్రయత్నాలు చేశాయి. లాక్‌డౌన్‌..

Monkeypox: ఆ బాలుడికి మంకీపాక్స్‌ నెగెటివ్‌ నిర్ధారణ.. ఊపిరి పీల్చుకున్న అధికారులు..!
Monkeypox
Follow us

|

Updated on: Aug 01, 2022 | 5:54 PM

Monkeypox: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మమహ్మారి ఎంతో భయాందోళనకు గురి చేసింది. కరోనా కట్టడికి దేశాలు శత విధాలుగా ప్రయత్నాలు చేశాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలు, వ్యాక్సినేషన్‌, ఇతర చర్యల వల్ల ప్రస్తుతం అదుపులో ఉంది. తర్వాత కరోనా కొత్త కొత్త వేరియంట్లతో పుట్టుకొచ్చి కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఇక తాజాగా దేశంలో మంకిపాక్స్‌ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. భారత్‌లో కూడా మంకీ పాక్స్‌ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. అటు కేరళ, తెలంగాణలోనూ మంకీపాక్స్‌ కేసులు వెలుగు చూడటంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఇక ఏపీలోని గుంటూరు జీజీహెచ్‌లో ఓ 8 ఏళ్ల బాలుడికి మంకీపాక్స్‌ లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రిలో చేర్పించి రక్తనమూనాలను ల్యాబ్‌కు పంపించారు. దీంతో ఈ బాలుడి రిపోర్టులో మంకీపాక్స్‌ నెగెటివ్‌ వచ్చింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే ముందుగా బాలుడి ఒంటిపై దద్దుర్లతో ఈనెల 29వ తేదీన గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించారు. అతని నమూనాలను పూణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. తాజాగా రిపోర్టు రావడంతో అందులో నెగెటివ్‌ వచ్చిందని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. దీంతో అధికారులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇలా మంకీపాక్స్‌ కేసులు రాష్ట్రాలకు చేరుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి