AP Housing Scheme: ఏపీ హైకోర్టుల జగన్ సర్కార్‌కు ఊరట.. ‘పేదలందరికీ ఇళ్లు’ నిర్మాణానికి లైన్‌క్లియర్

YSR Colonies: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఏపీలో పేదలందరికీ ఇల్లు పథకంపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది.

AP Housing Scheme: ఏపీ హైకోర్టుల జగన్ సర్కార్‌కు ఊరట.. ‘పేదలందరికీ ఇళ్లు’ నిర్మాణానికి లైన్‌క్లియర్
Ap High Court
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 30, 2021 | 5:13 PM

AP High Court on AP Housing Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఏపీలో పేదలందరికీ ఇల్లు పథకంపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఇళ్ల స్థలాల పై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. గత నెల 8న పేదలందరికీ స్థలాలు పథకంలో భాగంగా ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు చేయొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చింది.

రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలు ఉండకూడనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పేదలందరికీ ఇళ్లు’ నిర్మాణ పథకానికి మార్గం సుగమమైంది. రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు పథకంపై హైకోర్టులోని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్‌ బెంచ్‌ మంగళవారం రద్దు చేసింది. నవరత్నాల అమల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దుచేయాలని, అత్యవసర విచారణ జరపాలని కోరింది. ఈ అప్పీలును అత్యవసరంగా విచారించేందుకు అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి నిరాకరించారు.

కాగా, పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో తాత్కాలికంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు.. సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసింది. హైకోర్టులోని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్‌ బెంచ్‌ కొట్టివేసింది.

Read Also… Jagananna Vidya Deevena: ఉన్నత స్థాయికి ఎదగడానికి పేదరికం అడ్డుకారాదు.. తలరాతలు మారాలంటే చదువకోవల్సిందేః సీఎం జగన్