ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై సీఎం జగన్మోహన్(CM.Jagan) రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజల వద్దకు వెళ్లాల్సింది మీరు.. ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాల్సింది మీరు.. ప్రజలు ఓట్లు వేయాల్సింది మీకే కదా? గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమానికి మీరు వెళ్లకుండా మీ మనుషులను పంపడమేంటని సీరియస్ అయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కచ్చితంగా ప్రతి గడపకూ వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత తొలిసారిగా జరిగిన కేబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ మంది మంత్రులు కొత్తవారు కావడంతో ఎజెండా అంశాలపై చర్చ ముగిసి, అధికారులు బయటకు వెళ్లిపోయాక మంత్రులతో సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు.
ఇంటింటికీ వెళ్లి మూడేళ్లలో ప్రభుత్వం వారికి ఏం చేసిందో వివరాలతో సహా చెప్పాలి. ఎవరైనా ఏదైనా అంశంపై ప్రశ్నిస్తే వారికి సమాధానం చెప్పండి. అడిగేవారికి ప్రభుత్వం ఏమేం ఇచ్చిందో వివరించండి. టీడీపీ మద్దతుదారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారితోనూ మాట్లాడండి. వారిళ్లలోనూ ప్రభుత్వం ఏమేం ఇచ్చిందో చెప్పండి. ప్రతి ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకుని వెళ్లాల్సిందే. పార్టీ సమన్వయ కర్తలు పర్యవేక్షించి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తారు. పార్టీ ఉంటేనే మనమంతా ఉంటామనే విషయాన్ని గుర్తుంచుకోండి.
– వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
మరోవైపు.. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్తున్న వారికి పలుచోట్ల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మురుగు కాలువలు నిర్మించడం లేదని, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయని, ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని, ఇంటి నిర్మాణ బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక తమకు జరిగిన అన్యాయంపై సూళ్లూరుపేటలో మహిళలు నిలదీశారు. అధికార పార్టీ వారికీ పథకాలు సరిగా అందడం లేదని, ఇలాగైతే తాము ప్రజల వద్దకు ఎలా వెళ్లగలమంటూ పల్నాడు, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి
విశాఖ పెళ్లి కూతురు సృజన మృతి కేసులో మరో ట్విస్ట్ .. బ్యాగులో గన్నేరు పప్పు.. అదే కారణమా..?