సొంత పార్టీ ఎమ్మెల్యే అరెస్ట్.. ఇదీ ‘జగన్’ మార్క్

మొదటిసారి సీఎంగా అధికార పగ్గాలు చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికీ నాలుగు నెలలను పూర్తి చేసుకున్నాడు. ఈ నాలుగు నెలల్లో పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ.. పరిపాలనలో తనదైన మార్కును చూపిస్తున్నారు. ముఖ్యంగా పారదర్శక పాలన చేస్తానని ముందు నుంచి చెబుతూ వస్తోన్న జగన్.. తప్పు చేస్తే ఎవ్వరినీ వదలనని పలు సందర్బాల్లో వెల్లడించారు. ఆ మాటకు కట్టుబడి ఉండి.. తాజాగా తన సొంత పార్టీ ఎమ్మెల్యే అయిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఆయన అరెస్ట్ చేయించారు. […]

సొంత పార్టీ ఎమ్మెల్యే అరెస్ట్.. ఇదీ 'జగన్' మార్క్
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Oct 06, 2019 | 12:05 PM

మొదటిసారి సీఎంగా అధికార పగ్గాలు చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికీ నాలుగు నెలలను పూర్తి చేసుకున్నాడు. ఈ నాలుగు నెలల్లో పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ.. పరిపాలనలో తనదైన మార్కును చూపిస్తున్నారు. ముఖ్యంగా పారదర్శక పాలన చేస్తానని ముందు నుంచి చెబుతూ వస్తోన్న జగన్.. తప్పు చేస్తే ఎవ్వరినీ వదలనని పలు సందర్బాల్లో వెల్లడించారు. ఆ మాటకు కట్టుబడి ఉండి.. తాజాగా తన సొంత పార్టీ ఎమ్మెల్యే అయిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఆయన అరెస్ట్ చేయించారు. దీంతో ఏపీలో రాజకీయాలు మరింత రసవత్తరం అయ్యాయి. సాధారణంగా అధికారంలో ఉన్న ఎవరైనా.. తమ పార్టీ నేతలపై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చుతూ ఉంటారు. కానీ జగన్ మాత్రం తప్పు చేసిన తన ఎమ్మెల్యేను అరెస్ట్ చేయించడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

అయితే ఇలాంటి ఘటనే గతంలో చంద్రబాబు హయాంలోనూ జరిగింది. అప్పట్లో ఎమ్మెల్యే అయిన చింతమనేని ప్రభాకర్.. మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై చేయి చేసుకున్నారు. దీనికి సంబంధించిన కచ్చితమైన ఆధారాలు కూడా లభించాయి. అదొక్కటే కాదు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చింతమనేని ఆగడాలు మరెన్నో సాగాయి. కానీ అప్పటి సీఎం చంద్రబాబు మాత్రం చింతమనేనిపై ఈగ వాలనీయకుండా చూసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు వనజాక్షి విషయంలో.. ఆమెను ఇంటికి పిలిపించుకొని వ్యవహారం సెటిల్ చేసినట్లు వార్తలు వినిపించాయి. కానీ జగన్ మాత్రం చంద్రబాబులా కాకుండా.. ఘటనపై ఆరా తీసి, ఎమ్మెల్యేను అరెస్ట్ చేయించడం గమనర్హం. ఏది ఏమైనా ఆరు నెలల్లో బెస్ట్ సీఎం అనిపించుకుంటానని వాగ్ధానం ఇచ్చిన జగన్.. ఈ విషయంలో మాత్రం నిజంగానే అనిపించుకున్నాడని పలువురు కామెంట్లు పెడుతున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu