‘జగనన్న చేదోడు’..అర్హ‌త ఉన్న‌వారికి మ‌రో ఛాన్స్….

'జగనన్న చేదోడు’ పథకం కింద లబ్ధి పొందేందుకు అన్ని అర్హ‌త‌లు క‌లిగి ఉండి అనివార్య కార‌ణాల వ‌ల్ల‌ పేర్లు నమోదు చేసుకోనివారు.. జులై 10 వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం ఇస్తున్న‌ట్లు ఏపి బీసీ కార్పొరేషన్‌ తెలిపింది.

'జగనన్న చేదోడు’..అర్హ‌త ఉన్న‌వారికి మ‌రో ఛాన్స్....
Follow us

|

Updated on: Jun 15, 2020 | 9:28 AM

‘జగనన్న చేదోడు’ పథకం కింద లబ్ధి పొందేందుకు అన్ని అర్హ‌త‌లు క‌లిగి ఉండి అనివార్య కార‌ణాల వ‌ల్ల‌ పేర్లు నమోదు చేసుకోనివారు.. జులై 10 వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం ఇస్తున్న‌ట్లు ఏపి బీసీ కార్పొరేషన్‌ తెలిపింది. అర్హత ఉన్నవారు గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా అర్జి పెట్టుకోవాల‌ని సూచించింది.

కాగా గ‌త‌ బుధవారం సీఎం జ‌గ‌న్.. ‘జగనన్న చేదోడు’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద వెన‌బ‌డిన సామాజిక వ‌ర్గాల‌కు( రజక, నాయీబ్రాహ్మణ, టైలర్‌(దర్జీ)) రూ.10వేలు బ్యాంకు ఖాతాల్లో జ‌మ చేశారు. ఎన్నికల సమయంలో జ‌గ‌న్ ఈ హామి ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా మొత్తం 2,47,040 మంది లబ్దిదారులకు రూ.247.04 కోట్ల ఆర్దిక సాయం అందింది.