బాబుకు థ్యాంక్స్ చెప్పిన జగన్

నాలుగోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా జరిగాయి. ఇవాళ్టి చర్చల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోన్న ఇంగ్లీష్ మీడియం బోధనపై అధికార, విపక్షాల ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం జరిగింది. ముఖ్యంగా సీఎం జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఒకరిపై మరొకరు విమర్శలు కురిపించుకున్నారు. ఇక చివరకు ఇంగ్లీష్ మీడియం బోధనకు ప్రతిపక్ష నేత చంద్రబాబు మద్ధతు తెలపడంతో.. దానిపై స్పందించిన సీఎం జగన్ ఆయనకు థ్యాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఇంగ్లీష్ మీడియంపై […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:07 pm, Thu, 12 December 19
బాబుకు థ్యాంక్స్ చెప్పిన జగన్

నాలుగోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా జరిగాయి. ఇవాళ్టి చర్చల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోన్న ఇంగ్లీష్ మీడియం బోధనపై అధికార, విపక్షాల ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం జరిగింది. ముఖ్యంగా సీఎం జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఒకరిపై మరొకరు విమర్శలు కురిపించుకున్నారు. ఇక చివరకు ఇంగ్లీష్ మీడియం బోధనకు ప్రతిపక్ష నేత చంద్రబాబు మద్ధతు తెలపడంతో.. దానిపై స్పందించిన సీఎం జగన్ ఆయనకు థ్యాంక్స్ చెప్పారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఇంగ్లీష్ మీడియంపై సామాజిక వర్గ దాడి చేశారని, పేదవాడికి ఇంగ్లీష్ చదువు అందకూడదని యుద్ధం చేశారని ఆరోపించారు. తాము ఇంగ్లీష్ మీడియం పెట్టాలని నిర్ణయం తీసుకున్నప్పుడు చంద్రబాబు తుగ్లక్ చర్యలతో పోల్చలేదా..? అంటూ ప్రశ్నించిన జగన్.. తెలుగులో చదివితే ఉద్యోగాలు రావా అంటూ బాబు అన్నారని గుర్తుచేశారు. ఆ తరువాత ప్రజల్లో స్పందన చూసి వారు యూటర్న్ తీసుకున్నారని దుయ్యారబట్టారు. పేదవారికి ఇంగ్లీష్ మీడియం అందించాలన్నదే ప్రభుత్వ తాపత్రయమని.. రైటు టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని గర్వంగా చెబుతున్నామని ఈ సందర్భంగా జగన్ చెప్పుకొచ్చారు. ఏదేమైనా మొత్తానికి ఇంగ్లీష్ మీడియం బోధనకు చంద్రబాబు మద్ధతిచ్చినందుకు థ్యాంక్స్ అంటూ జగన్ తెలిపారు. కాగా అధికార, విపక్ష పార్టీ నేతల మాటల యుద్ధం నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా పడింది.