పప్పూ! నీది సార్ధక నామధేయం: లోకేష్‌పై విజయసాయి విసుర్లు

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌పై ట్విట్టర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ‘‘పప్పూ! నీది సార్ధక నామధేయం. జనాభా లెక్కలు పదేళ్లకోసారి జరుగుతాయి. ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఎన్ఆర్సీ అని అర్థం చేసుకున్నావంటే నీ ఇంగ్లీష్, నీ ఙ్ఞానం చూసి మీ నాన్న నవ్వాలో, ఏడవాలో తెలియక రోజు ప్రెస్‌మీట్‌లో ఫ్రస్టేట్ అవుతున్నారు అని విజయసాయి రెడ్డి’’ ఘాటు కామెంట్లు చేశారు. అయితే జనాభా గణనకు సంబంధించి ఇటీవల ఓ జీవోను ఏపీ […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:12 pm, Wed, 25 December 19
పప్పూ! నీది సార్ధక నామధేయం: లోకేష్‌పై విజయసాయి విసుర్లు

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌పై ట్విట్టర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ‘‘పప్పూ! నీది సార్ధక నామధేయం. జనాభా లెక్కలు పదేళ్లకోసారి జరుగుతాయి. ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఎన్ఆర్సీ అని అర్థం చేసుకున్నావంటే నీ ఇంగ్లీష్, నీ ఙ్ఞానం చూసి మీ నాన్న నవ్వాలో, ఏడవాలో తెలియక రోజు ప్రెస్‌మీట్‌లో ఫ్రస్టేట్ అవుతున్నారు అని విజయసాయి రెడ్డి’’ ఘాటు కామెంట్లు చేశారు.

అయితే జనాభా గణనకు సంబంధించి ఇటీవల ఓ జీవోను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. ఆ జీవోను సోషల్ మీడియాలో ట్వీట్ చేసిన నారా లోకేష్.. ‘‘వైసీపీ నాయకులు వారి అధ్యక్షుడు వైఎస్ జగన్ గారే పెయిడ్ ఆర్టిస్ట్ అని గుర్తించడం మంచిది. పార్లమెంట్లో మద్దతు ఇస్తారు. అసెంబ్లీలో నోటిఫికేషన్లు ఇస్తారు. బయట మాత్రం మేము వ్యతిరేకం అని ప్రచారం చేస్తారు. 16 ఆగష్టు 2019న ఎన్నార్సీపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం’’ అని కామెంట్ చేశారు. దానిపై విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.