తలుపులు వేసి చావగొడతా.. అధికారులపై టీడీపీ నేత రౌడీయిజం

శ్రీకాకుళం జిల్లాలో మాజీ విప్ కూన రవి తన రౌడీయిజం చూపించారు. సరుబుజ్జిలి ఎంపీడీవో కార్యాలయంలో తన అనుచరులతో కలిసి ఆయన హల్‌చల్ చేశారు. స్పందన కార్యక్రమంలో పాల్గొన్న ప్రాజెక్ట్ ఆఫీసర్ కమల పాండ్యన్‌, ఎంపీడీవో, తహశీల్దార్, స్పెషల్ ఆఫీసర్లను అతడు బెదిరించాడు. ’’మీ సీట్‌లోనే కూర్చుంటా.. ఎవరొస్తారో చూస్తా.. తలుపులు వేసి చావగొడతానంటూ’’ వారికి ఆయన వార్నింగ్ ఇచ్చాడు. దీనిపై తహశీల్దార్, అధికారులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు వ్యక్తిగత […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:18 pm, Tue, 27 August 19
తలుపులు వేసి చావగొడతా.. అధికారులపై టీడీపీ నేత రౌడీయిజం

శ్రీకాకుళం జిల్లాలో మాజీ విప్ కూన రవి తన రౌడీయిజం చూపించారు. సరుబుజ్జిలి ఎంపీడీవో కార్యాలయంలో తన అనుచరులతో కలిసి ఆయన హల్‌చల్ చేశారు. స్పందన కార్యక్రమంలో పాల్గొన్న ప్రాజెక్ట్ ఆఫీసర్ కమల పాండ్యన్‌, ఎంపీడీవో, తహశీల్దార్, స్పెషల్ ఆఫీసర్లను అతడు బెదిరించాడు. ’’మీ సీట్‌లోనే కూర్చుంటా.. ఎవరొస్తారో చూస్తా.. తలుపులు వేసి చావగొడతానంటూ’’ వారికి ఆయన వార్నింగ్ ఇచ్చాడు. దీనిపై తహశీల్దార్, అధికారులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డాడంటూ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరోవైపు కూన రవికుమార్‌ బెదిరింపుపై గెజిటెడ్ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అధికారులను బెదిరించడం దారుణమని, కూన రవిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. రవిపై నాన్‌బెయిలబుల్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని ఏపీ గెటిటెడ్ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు.