అక్కడ కుప్పలు తెప్పలుగా నోట్ల కట్టలు.. ఎటు చూసినా డబ్బే డబ్బు.. అసలు మ్యాటర్ ఏంటంటే?
అదో ప్రభుత్వ కార్యాలయం సడెన్‌గా ఆఫీస్‌లోకి ఏసీబీ అధికారులు వచ్చారు. అటెంన్షన్ ఎవ్రీబడి ఇక్కడ సోదాలు జరుగుతాయి, ఎక్కడివారు అక్కడే ఉండండి అంటూ ఆదేశాలిచ్చారు.. అంతే ఓ వ్యక్తి కిటికీలో నుంచి 30 వేల రూపాయల డబ్బులు కిందకు విసిరేసి పారిపోయాడు. అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆ డబ్బును తీసుకొని అది విసిరేసి వెళ్లిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

ఏసీబీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఒక వ్యక్తి ప్రభుత్వ కార్యాలయం కిటికీలోంచి రూ.30 వేలు విసిరేసి పారిపోయిన ఘటన ఒంగోలు జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలులో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలోని ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇటీవల ఏసిబి అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏసిబి అధికారులు కార్యాలయంలోకి రాగానే కిటికీలో నుంచి 30 వేల రూపాయల నగదు బయటకు విసిరేశాడో వ్యక్తి.. వెంటనే ఆ డబ్బును స్వాధీనం చేసున్న అధికారులు.. డబ్బులు విసిరేసిన వ్యక్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని ఉద్యోగా, లేక బయటి వ్యక్తా.. అంటూ అధికారులు ఆరా తీస్తున్నారు.
అనంతరం సోదాలను కొనసాగించారు. ఈ సోదాల్లో భాగంగా ఆఫీస్ బాత్ రూంలో మరో రూ. 10 వేలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నాడు. అలాగే కొంతమంది ఉద్యోగుల దగ్గర కూడా నగదు లభించింది. ఉద్యోగులు విధుల్లోకి వచ్చే ముందు తమ జేబు, వాలెట్‌లో ఉన్న డబ్బుల వివరాలు రికార్డులో నమాదు చేయాల్సి ఉంటుంది. అలా ఉద్యోగుల దగ్గర దొరికిన డబ్బుల వివరాలు రికార్డుల్లో సరిగ్గా ఉన్నాయో లేదో అనేది తెలుసుకొని వారికి డబ్బు తిరిగి ఇస్తామని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజల నుంచి ఏసీబీ అధికారులు ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. రికార్డులు పూర్తిగా తనిఖీ చేసిన అనంతరం పూర్తి వివరాలు తెలుపుతామని ఏసిబి సిఐ రమేష్ తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




