సాధినేని యామిని శ‌ర్మ‌కు అరుదైన గౌర‌వం

బీజేపీ నాయ‌కురాలు సాధినేని యామిని శ‌ర్మ‌కు అరుదైన గౌర‌వం ల‌భించింది. అమెరికాలోని భారతీయ యువ పారిశ్రామిక వేత్తల సంఘం గౌరవ అధ్యక్షురాలిగా బిజెపి నేత యామినీ శర్మ ఎంపికయ్యారు.

సాధినేని యామిని శ‌ర్మ‌కు అరుదైన గౌర‌వం
Follow us

|

Updated on: May 04, 2020 | 10:12 AM

బీజేపీ నాయ‌కురాలు సాధినేని యామిని శ‌ర్మ‌కు అరుదైన గౌర‌వం ల‌భించింది. అమెరికాలోని భారతీయ యువ పారిశ్రామిక వేత్తల సంఘం గౌరవ అధ్యక్షురాలిగా బిజెపి నేత యామినీ శర్మ ఎంపికయ్యారు. ఈ మేరకు వారు పంపిన లేఖను ఆమె తన ఫేస్ బుక్ ద్వారా షేర్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో (పెద్ద, మధ్యస్థ, చిన్న, ప్రారంభ, ప్రభుత్వ విభాగాలు, ఆర్థిక, విద్యా సంస్థలు, ఎన్జీఓలు) సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా ప్రత్యేక సలహా సేవలను ఈ సిఐఎంఎస్ఎంఈ సంస్థ అందిస్తుంది. అలాగే, భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తుంది. సిఐఎంఎస్ఎంఈ గ్లోబల్ ప్రెసిడెంట్ గా ఎంపికైన యామినీ శర్మ తమ సిఐఎంఎస్ఎంఈ ద్వారా భారత్ లో పెట్టుబడులు పెట్టే విధంగా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తామని చెప్పారు.